AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: బ్యాంకుకు వెళ్లే ముందు ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి.. నవంబర్‌లో భారీగా సెలవులు..

బ్యాంక్ సెలవులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నవంబర్‌లో దీపావళి, లక్ష్మీపూజ, ఛత్ పూజ, గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల్లో మార్పులు ఉంటాయి. వచ్చే నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి..? ఏ రాష్ట్రంలో సెలవులు ఏ రోజు ఉన్నాయి? అనేది చూద్దాం.

Bank Holidays: బ్యాంకుకు వెళ్లే ముందు ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి.. నవంబర్‌లో భారీగా సెలవులు..
Bank Holidays
Venkatrao Lella
|

Updated on: Oct 31, 2026 | 6:55 AM

Share

రేపటి నుంచి నవంబర్ నెల ప్రారంభమతోంది. దీంతో బ్యాంకులకు సెలవులు మారుతున్నాయి. జాతీయ సెలవులు, ప్రాంతీయ పండగులు, స్థానిక పండుగలు, షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకుల కోసం బ్యాంక్ తేదీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకులను సందర్శించాలనుకునేవారు బ్యాంకులను సంప్రదించి ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. బ్యాంక్ ఖాతాదారులు తమ రాష్ట్రాల బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను చెక్ చేసుకోవడం మంచిది. ఒక్కొ రాష్ట్రంలో ఒక్కొలా సెలవులు ఉంటున్న క్రమంలో మీ స్థానిక బ్యాంక్ సెలవులు గురించి అవగాహన కలిగి ఉండాలి. ఏమైనా సందేహాలుంటే బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి సమాచారం పొందవచ్చు. వచ్చే నెలలో బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకుందాం.

నవంబర్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం దేశంలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవులు మారుతూ ఉంటాయి. దీపావళి, లక్ష్మీపూజ, గోవర్దన్ పూజ, ఛత్ పూజ, గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఎక్కువ రోజులు మూతపడనున్నాయి. నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకుందాం.

-నవంబర్ 8వ తేదీన ఆదివారం, దీపావళి సందర్భంగా బ్యాంకులకు సెలవు

-నవంబర్ 9వ తేదీన లక్ష్మీపూజ సందర్భంగా త్రిపుర, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు

-నవంబర్ 10వ తేదీన గోవర్ధన్ పూజ,లక్ష్మీ పూజ,విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ పురస్కరించుకుని గుజరాత్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కింలలో బ్యాంకులు ఉండవు

-నవంబర్ 11న నింగోల్ చకౌబా/భ్రాత్రిద్వితీయ/భైడూజ్/చిత్రగుప్త్ జయంతి కారణంగా సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి

-నవంబర్ 13వ తేదీన వాంగాలా పండుగను పురస్కరించుకుని మేఘాలయలో బ్యాంకులు ఉండవు

-నవంబర్ 16, 2026న ఛత్ పూజ,సూర్య షష్టి దాలా ఛత్ (ప్రత్ అర్ఘ్య) సందర్భంగా బీహార్, జార్ఖండ్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి

-నవంబర్ 20వ తేదీన ఐగాస్-బాగ్వాల్ వేడుకల సందర్భంగా ఉత్తరాఖండ్‌లో బ్యాంకులు బంద్

-నవంబర్ 23న సెంగ్ కుట్ స్నెమ్ వేడుకల సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూతపడనున్నాయి

-నవంబర్ 24వ తేదీన గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ/రహస్ పూర్ణిమను పురస్కరించుకుని మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీర్ ప్రదేశ్‌లలో బ్యాంకులు ఉండవు

– నవంబర్ 27న కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో ఉండవు

ఈ రోజుల్లో కూడా బంద్..

నవంబర్ 1,8,14,15,22,28,29వ తేదీలలో వారాంతరపు సెలవుల కారణంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.

Follow Us