AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమగా బిర్యానీ పెడితే ఆత్రంగా తిన్నారు.. అదే చిన్నారులకు చివరి భోజనమైంది!

చిన్నారులకు ప్రేమగా చికెన్ బిర్యానీ వడ్డించింది. పిల్లలు ఇష్టంగా తింటుంటే చూస్తూ ఉండిపోయింది. కానీ ఆ ఆహారంలోనే వారి ప్రాణాలు తీసే విషాన్ని కలిపింది. మొదటిసారి పిల్లలు చనిపోకపోవడంతో మరోసారి విషం పెట్టేందుకు కూడా కుట్ర పన్నింది. చివరకు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రేమగా బిర్యానీ పెడితే ఆత్రంగా తిన్నారు.. అదే చిన్నారులకు చివరి భోజనమైంది!
Stepmother Allegedly Poisons
Balaraju Goud
|

Updated on: Oct 30, 2026 | 12:48 PM

Share

చిన్నారులకు ప్రేమగా చికెన్ బిర్యానీ వడ్డించింది. పిల్లలు ఇష్టంగా తింటుంటే చూస్తూ ఉండిపోయింది. కానీ ఆ ఆహారంలోనే వారి ప్రాణాలు తీసే విషాన్ని కలిపింది. మొదటిసారి పిల్లలు చనిపోకపోవడంతో మరోసారి విషం పెట్టేందుకు కూడా కుట్ర పన్నింది. చివరకు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కలుషిత ఆహారం కారణంగానే పిల్లలు చనిపోయారంటూ నమ్మించే ప్రయత్నం చేసిన నిందితుల అసలు బండారం పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

ప్రేమ వివాహం.. ఆ తర్వాత రెండో పెళ్లి

పోలీసుల వివరాల ప్రకారం.. బ్రాహ్మణకోడూరుకు చెందిన స్వర్ణ, నెహ్రూనగర్‌కు చెందిన రాంబాబు 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సాత్విక్‌ (10), నిత్య (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా 2022లో స్వర్ణ ఆత్మహత్య చేసుకున్నారు. అనంతరం రాంబాబు మేరీ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా గతంలో వివాహం కాగా, ఒక కుమారుడు ఉన్నాడు.

అయితే భర్త మొదటి భార్యకు పుట్టిన పిల్లలపై మేరీకి సానుకూలత లేకపోయిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆస్తి విషయంలోనూ కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఆస్తి మొదటి భార్య పిల్లలకే దక్కుతుందనే ఆలోచనతో వారిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని మేరీ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

బిర్యానీలో ఎలుకల మందు.. రెండుసార్లు కుట్ర

అక్టోబర్ నెల 20వ తేదీన చికెన్ బిర్యానీలో ఎలుకల మందు కలిపి చిన్నారులకు తినిపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఆ రోజు పిల్లలు ప్రాణాలతో బయటపడటంతో మరోసారి విషం కలిపి ఆహారం పెట్టాలని ఆమె పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉండగా, దసరా ఉత్సవాల్లో భోజనం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన చిన్నారులు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో రాంబాబు వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లాడు. కలుషిత ఆహారం తినడం వల్లే అనారోగ్యం వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేశారు. చివరకు ఈ నెల 24న ఇద్దరు చిన్నారులూ ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల విచారణతో బయటపడిన నిజం

పిల్లల మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కొత్తపేట సీఐ వీరయ్యచౌదరి మృతదేహాలను పరిశీలించి, విష పదార్థం తీసుకోవడం వల్లే మరణించి ఉండవచ్చని అనుమానించారు. అనంతరం రాంబాబు ఇంటిని తనిఖీ చేయగా ఎలుకల మందు లభించింది. దీంతో లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు ఘటన వెనుక కుట్రను వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మేరీతో పాటు ఆమె భర్త రాంబాబును అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలిగొన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రేమగా బిర్యానీ పెడితే నిజమనుకున్నారు.. పాపం!
ప్రేమగా బిర్యానీ పెడితే నిజమనుకున్నారు.. పాపం!
శ్రేయాస్ అయ్యర్ @ 19.. టీ20 హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్
శ్రేయాస్ అయ్యర్ @ 19.. టీ20 హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్
పండక్కి ముందే గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన కూరగాయల ధరలు
పండక్కి ముందే గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన కూరగాయల ధరలు
మొక్కల మధ్య పసుపు పచ్చని పాము.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్!
మొక్కల మధ్య పసుపు పచ్చని పాము.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్!
బలాన్నిచ్చే మిల్లెట్ ఇడ్లీ.. మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?
బలాన్నిచ్చే మిల్లెట్ ఇడ్లీ.. మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?
లైట్ తీసుకోకండి.. ఈ లక్షణాలు కనిపిస్తే కడుపు క్యాన్సర్ ఉన్నట్లే
లైట్ తీసుకోకండి.. ఈ లక్షణాలు కనిపిస్తే కడుపు క్యాన్సర్ ఉన్నట్లే
కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు..
కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు..
కాలేజీల్లో సినిమా ఈవెంట్లపై విద్యా మండలి సీరియస్
కాలేజీల్లో సినిమా ఈవెంట్లపై విద్యా మండలి సీరియస్
ఆ హీరోని చూడటానికి వెళ్లి దెబ్బలు తగిలించుకున్న..
ఆ హీరోని చూడటానికి వెళ్లి దెబ్బలు తగిలించుకున్న..
రైళ్లల్లో లోయర్ బెర్త్ పొందాలనుకుంటున్నారా..? ఈ విషయం మర్చిపోకండి
రైళ్లల్లో లోయర్ బెర్త్ పొందాలనుకుంటున్నారా..? ఈ విషయం మర్చిపోకండి