NCPCR: నెట్‌ఫ్లిక్స్‌కు జాతీయ బాలల హక్కుల సంఘం నోటీసు.. ఆ వెబ్ సిరీస్‌ను ఆపాలంటూ ఆదేశం..
NCPCR Notice to Netflix: కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నియంత్రణకు గైడ్‌లైన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌పై..
NCPCR Notice to Netflix: కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నియంత్రణకు గైడ్‌లైన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘానికి ఫిర్యాదు అందింది. ‘బాంబే బేగమ్స్’ అనే వెబ్ సిరీస్‌లో పిల్లలు మత్తుపదార్థాలకు బానిస కావడం, తరగతి గదుల్లో అసభ్యంగా సెల్ఫీలు తీసుకోవడం, అసభ్యకరమైనటువంటి సన్నివేశాలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం దృష్టికి తీసుకెళ్లారు. బాంబే బేగమ్స్ సిరీస్‌ను నిలిపివేయాలంటూ ఫిర్యాదు చేశారు. పరిశీలించిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్) గురువారం నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసు జారీ చేసింది. వెంటనే బాంబే బేగమ్స్ వెబ్ సిరీస్ ప్రసారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై ఏం చర్య తీసుకుంటున్నారో అన్నదానిపై వివరణాత్మకంగా 24గంటల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లలను అసభ్యకరంగా చిత్రీకరించడం.. యువత మనస్సులను కలుషితం చేయడమేనని పేర్కొంది. ఈ నోటీసుపై నెట్‌ఫ్లిక్స్ స్పందించకపోతే.. చట్టపరమైన చర్యలను తీసుకుంటామని ఎన్‌సీపీసీఆర్ హెచ్చరించింది. పిల్లలకు సంబంధించిన కంటెంట్‌ను ప్రచారం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. అసభ్యకరమైన కంటెంట్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని (ఎన్‌సీపీసీఆర్) పిల్లల హక్కుల పరిరక్షణ అపెక్స్ కమిటీ సూచించింది. అయితే.. ఈ బొంబే బేగమ్స్ సిరీస్‌లో ఐదుగురు మహిళల జీవితాలకు సంబంధించిన కథాంశంతో రూపొందించారు. ఈ నేపథ్యంలో నోటిసుపై నెట్‌ఫ్లిక్స్ స్పందించింది. నివేదిక ఇచ్చేందుకు కొంత సమయం కావాలంటూ కమిషన్‌ను కోరింది.
Also Read: