Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వివరాలు ఇలా ఉన్నాయి.
బంగారం ధరల నేలచూపులు చూస్తుండడం కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. అయితే ఇది చాలా స్వల్పమనే చెప్పాలి. ఒకానొక సమయంలో తులం బంగారం రూ.55 వేలకు చేరువైన సందర్భాలు చూశాం.
Gold Price Today: బంగారం ధరల నేలచూపులు చూస్తుండడం కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. అయితే ఇది చాలా స్వల్పమనే చెప్పాలి. ఒకానొక సమయంలో తులం బంగారం రూ.55 వేలకు చేరువైన సందర్భాలు చూశాం. అయితే ప్రస్తుతం మాత్రం బంగారం ధరలు పతనమవుతున్నాయి. శనివారం కూడా దేశీయ మార్కెట్లో బంగారు ధరలు తగ్గాయి. ఈరోజు దేశ వ్యాప్తంగా 10 గ్రాముల బంగారం ధర వివరాలు ఎలా ఉన్నాయంటే..
దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం శుక్రవారంతో పోలిస్తే రూ.300తగ్గి, 22 క్యారెట్ల గోల్డ్ రూ.44,00 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికొస్తే 22 క్యారెట్ల తులం బంగారం రూ.43,530వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ విషయాని రూ.44,530వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.41,800వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.45,600వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ .41,850 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే రూ.45,650గా ఉంది. విజయవాడలోనూ బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రూ.41,850 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.45,650వద్ద ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.41,850గా నమోదైంది. 24 క్యారెట్ల విషయానికొస్తే.. రూ. 45,650 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :