Forest Officer Dances : బాధ మరిచి చిందేసిన మహిళా ఫారెస్ట్ ఆఫీసర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Forest Officer Dances : అడవికి అంటుకున్న నిప్పును ఆర్పడానికి వెళ్లిన ఓ ఫారెస్ట్ ఆఫీసర్‌కి అనుకోకుండా వరుణుడు కరుణించి వర్షం కురిపిస్తే ఎలా ఉంటుంది

Forest Officer Dances : బాధ మరిచి చిందేసిన మహిళా ఫారెస్ట్ ఆఫీసర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Forest Officer Dances
Follow us

|

Updated on: Mar 12, 2021 | 10:22 PM

Forest Officer Dances : అడవికి అంటుకున్న నిప్పును ఆర్పడానికి వెళ్లిన ఓ ఫారెస్ట్ ఆఫీసర్‌కి అనుకోకుండా వరుణుడు కరుణించి వర్షం కురిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. సరిగ్గా అదే జరిగింది. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

రాష్ట్రంలోని సిమ్లిపాల్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వులో నెల రోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు అటవీశాఖ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికి అదుపులోకి రాలేదు. మంటలార్పడానికి వెళ్లిన అటవీ సిబ్బందికి ఏం చేయాలో తోచడం లేదు. సరిగ్గా అదే సమయంలో వరుణుడు కరుణించి వర్షం కురిపించాడు. దీంతో విధుల్లో విధుల్లో ఉన్న ‘స్నేహ ధల్’ అనే అధికారిణి ఆనందంతో మైమరిచి పోయి పెద్దగా అరుస్తూ డాన్స్ చేసింది.

ఆమె ఆనందంగా గ్రోయింగ్ చేస్తున్న వీడియోను ‘కిషోర్ మొహంత’ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. తక్కువ వ్యవధిలోనే ఆ వీడియోను 1,76 వేల మంది వీక్షించడంతో పాటు అటవీని కాపాడుకున్నామనే సంతోషంలో నాట్యం చేస్తున్న స్నేహ ధల్‌‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పర్యావరణం, డ్యూటీ పట్ల ఆమె నిజమైన అంకితభావాన్ని కనబరించిందని కామెంట్లు చేస్తున్నారు.

కొన్ని రోజులుగా మంటల్లో చిక్కుకొని కాలిపోతున్న అడవిని వరుణుడు కాపాడాడని అందరు కామెంట్ చేస్తున్నారు. వృక్ష సంపదను కాపాడుకునే క్రమంలో విఫలమైన తమకు దేవుడు వర్షం రూపంలో సాయం చేశాడని, దీంతో అటవీని సంరక్షించుకున్నామని ఆ అధికారిణి పెద్దగా అరుస్తూ చిందేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. 23 సెకన్ల వ్యవధి గల వీడియోలో యువ అధికారి ఉత్సాహం, ఆనందాన్ని కనబరిచింది. దీంతో స్నేహ ఆనందాన్ని చూసిన నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని చదవండి : India vs England 1st T20: ఇంగ్లండ్‌ ఖాతాలో తొలి టీ20.. సునాయాసంగా టార్గెట్‌ను చేధించిన ఇంగ్లండ్‌ జట్టు..

ప్రకాశం జిల్లాలో విషాదం.. ప్రాణం తీసిన ఈత సరదా.. ఇద్దరు విద్యార్థుల మృతి..