Robot Shalu : ఏకంగా 47 భాషలు అనర్గళంగా మాట్లాడగల రోబోట్.. తయారుచేసింది ఎవరో తెలుసా..
టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. సైన్స్ సాయంతో ఎన్నో వింతలను సృష్టిస్తున్నారు శాస్త్రవేత్తలు. అద్భుతమైన పరికరాలను, ఆశ్చర్యం కలిగించే రోబోలను కూడా తయారు చేస్తున్నారు. ఇప్పటికే మనం ఎన్నో రోబోలను
Robot Shalu : టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. సైన్స్ సాయంతో ఎన్నో వింతలను సృష్టిస్తున్నారు శాస్త్రవేత్తలు. అద్భుతమైన పరికరాలను, ఆశ్చర్యం కలిగించే రోబోలను కూడా తయారు చేస్తున్నారు. ఇప్పటికే మనం ఎన్నో రోబోలను చూసాం. ఇక ఈ రోబో రజినీకాంత్ రోబోకు ఏమాత్రం తీసిపోదు. ఇది ఏకంగా 47 భాషలు మాట్లాడగలడు. దీనిని కనిపెట్టింది పెద్ద పేరుమోసిన శాస్త్రవేత్త కాదు ఒక సైన్స్ టీచర్. అదికూడా మన భారతీయుడు.
అసలు విషయం ఏంటంటే.. ముంబైలోని కేంద్రీయ విద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ టీచర్ దినేశ్ పటేల్, 47 భాషలు మాట్లాడే హ్యూమనాయిడ్ రోబోట్‌ను అభివృద్ధి చేశారు. దీనికి ‘షాలు’ అని పేరు పెట్టారు. ఈ రోబోట్ ఏకంగా 47 భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. దేశంలోని ప్రధాన భాషలతో పాటుగా 39 విదేశీ భాషలను కూడా అవలీలగా మాట్లాడగలదు ఈ రోబోట్.
మహిళా రూపంలో ఉన్న ఈ హ్యూమనాయిడ్ ఆడవారి గొంతుకతో మాట్లాడుతుంది. ‘షాలు’ అనే ఈ రోబోట్ అందరిని చక్కగా పలుకరించడంతోపాటు భావోద్వేగాలను కూడా వ్యక్తం చేయగలదు. అంతే కాదు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, పేపర్ చదవడం, పద్యాలు పాడటంతో పాటుగా ఇంట్లో పనులను సహకరిస్తుంది. జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్‌కు సంబంధించిన ప్రశ్నలకూ సమాధానం చెబుతుంది. ప్లాస్టిక్, కార్డ్‌బోర్డ్, చెక్క, అల్యూమినియం వంటి అందుబాటులో ఉన్న వస్తువులతో కేవలం 50 వేల రూపాయలతో ఈ రోబోట్ ను తయారుచేసారు దీపక్ పటేల్. ఈ రోబోట్ ను సృష్టించడానికి మూడేళ్లు పట్టిందని దీపక్ పటేల్ పేర్కొన్నారు.