మహారాష్ట్రలో అమ్మకానికి ప్రేమ మందిరం.. కారణం అదేనా..? జోక్యం చేసుకోవాలంటూ ప్రధానికి లేఖ

మహారాష్ట్రలో అపురూపమైన ప్రేమ మందిరం ‘బాషో’ విక్రయానికి రంగం సిద్ధమైంది. పూణెలోని కోరేగావ్‌లో నిర్మితమైన ఆచార్య రజనీష్ ప్రేమ మందిరం ‘బాషో’ విక్రయానికి ప్రయత్నిస్తోంది ఓషో ట్రస్ట్.

మహారాష్ట్రలో అమ్మకానికి ప్రేమ మందిరం.. కారణం అదేనా..? జోక్యం చేసుకోవాలంటూ ప్రధానికి లేఖ
Osho Temple Basho Is Ready To Sell In Maharashtra
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 13, 2021 | 8:24 AM

Osho Temple Basho Sell : మహారాష్ట్రలో అపురూపమైన ప్రేమ మందిరం ‘బాషో’ విక్రయానికి రంగం సిద్ధమైంది. పూణెలోని కోరేగావ్‌లో నిర్మితమైన ఆచార్య రజనీష్ ప్రేమ మందిరం ‘బాషో’ విక్రయానికి ప్రయత్నిస్తోంది ఓషో ట్రస్ట్. దీన్ని రూ. 107 కోట్లకు వెల కట్టారు. కరోనా మహమ్మారి మిగిల్చిన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక ఈ కఠిన నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని ట్రస్ట్ పేర్కొంది. అయితే దీని ఓషో శిష్యులు తీవ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓషో ఆశ్రమంతో దీర్ఘకాలంగా అనుంబంధం కలిగిన స్వామీ చైతన్య కిర్తి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాస్తూ ‘బాషో’ విక్రయాన్ని ఆపాలంటూ కోరారు.

కాగా, ఆనందం ఎక్కడుంటుందో అక్కడ ప్రేమ ఉంటుందని, ప్రేమలో పరమాత్ముడుంటాడని ఆచార్య రజనీష్ ఓషో ప్రబోధాలు భక్తుల్లో ఎంతో ప్రేమను సంపాదించి పెట్టాయి. అలాగే, ఈ సందేశం వ్యాప్తి చేసేందుకు కోరేగావ్‌లో 28 ఎకరాల్లో ప్రేమ మందిరం ‘భాషో’ను ఆచార్య రజనీష్ నిర్మించారు. దీని విక్రయం గురించి ఓషో ఇంటర్నేషనల్ ఫౌండేష్(ఓఐఎఫ్) నిర్వాహకులు సమాచారం ఇస్తూ… కరోనా కాలం ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబరు 2020 వరకూ ‘భాషో’ నిర్వహణకు రూ. 3 కోట్ల 65 లక్షల రూపాయలు ఖర్చయ్యింది. ట్రస్ట్ నిర్వహణకు ప్రస్తుతం డబ్బుల అవసరం ఎంతోవుంది. ఆచార్య రజనీష్ ప్రారంభించిన కమ్యూన్ దాని ధ్యాన కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసింది. అందుకోసమే ‘భాషో’లోని కొన్ని ప్లాట్లను విక్రయించాలనుకుంటున్నామని తెలిపారు. ఛారిటీ కమిషనర్ ద్వారా కొరెగావ్ పార్క్ ప్రాంతంలో ఉన్న రెండు ప్లాట్లను (సుమారు 9,836 చదరపు మీటర్లు) ఇతరులకు కట్టబెట్టేందుకు నిర్ణయించారు. ఇక్కడ ఉన్న రిసార్ట్‌లో బజాజ్‌కు చెందిన రాజీవ్‌నయన్ బజాజ్‌కు విక్రయించడానికి అనుమతి కోరింది.

అయితే, ఓషో-యోగేశ్ ఠక్కర్ అలియాస్ స్వామి ప్రేమ్‌గీత్, కిషోర్ రావల్ అలియాస్ స్వామి అనాద్ అనే ఇద్దరు శిష్యులు ముంబై ఛారిటీ కమిషనర్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. ఓషో ఆశ్రమం విక్రయంపై తమ అభ్యంతరాలను పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను మార్చి 15న చేపట్టనున్నట్లు ముంబై ఛారిటీ కమిషన్ తెలిపింది. ముంబైలో ఆస్తి పూణేలో ఉన్నప్పుడు ఆస్తుల కోసం ఆఫర్లను ఆహ్వానించడానికి టెండర్ నోటీసు ప్రకటనను ప్రచురించడం ప్రధాన అభ్యంతరం అని స్వామి ప్రేమ్‌గీత్ తెలిపారు. టెండర్ నోటీసులో ఆస్తి యజమాని పేరు, ధర్మకర్తల పేరు ఎందుకు లేవు. ఏ ఆస్తి అమ్మకానికి ధర్మకర్తలు లేదా యజమానులు ఎవరు అని ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రేమ్‌గీత్ పిటిషన్‌లో వివరించారు. ఛారిటీ కమిషనర్ నిర్దేశించిన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇదిలావుంటే, కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశ,విదేశీయుల రాకపోకలు నిలిచిపోయాయి. ఆశ్రమానికి రాబడి పూర్తిగా తగ్గిపోయింది. అందుకే బాషో ధ్యాన రిసార్ట్ ఆస్తిలో కేవలం 10% మాత్రమే విక్రయానికి పెట్టినట్లు ఓషో ఆశ్రమ ధర్మకర్తలలో ఒకరైన మా అమృత్ సాధనా పేర్కొంది. ఆశ్రయం చాలా సువిశాలమైందని, బాషో భాగాల భర్తీకి అనేక ప్రదేశాలను అందిస్తుంది. వీటిలో పూల్, జాకుజీ మొదలైనవి ఉన్నాయి. వీటి కోసం కొత్త డిజైన్లు రూపొందించి, మరింత సుందరంగా ఆశ్రమాన్ని తీర్చిదిద్దేందుకు ఆర్ధిక వననరులు సమకూరుతాయని ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదీ చదవండిః మరోసారి లాక్‌డౌన్.. మార్చి 31 వరకు స్కూల్స్‌ మూసివేత.! నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.!