AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scary Video: రాకాసి పిడుగు దెబ్బ.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు.. ఒళ్లుగగురుపొడిచే వీడియో.!

Struck By Lightning: చావు మనల్ని ఎలా..ఎప్పుడు.. పలకరిస్తుందో.! ఎవ్వరికీ తెలియదు. కొన్నిసార్లు మనల్ని మనం రక్షించుకోవాలని అనుకుంటే..

Scary Video: రాకాసి పిడుగు దెబ్బ.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు.. ఒళ్లుగగురుపొడిచే వీడియో.!
Lighting Strike
Ravi Kiran
|

Updated on: Mar 13, 2021 | 1:02 PM

Share

Struck By Lightning: చావు మనల్ని ఎలా..ఎప్పుడు.. పలకరిస్తుందో.! ఎవ్వరికీ తెలియదు. కొన్నిసార్లు మనల్ని మనం రక్షించుకోవాలని అనుకుంటే.. అవే ప్రమాదాలను తెచ్చిపెడతాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే తాజాగా జరిగింది. వర్షంలో తడవకుండా చెట్టు నీడకు చేరిన నలుగురి వ్యక్తులు అనూహ్యంగా ప్రమాదంలో పడ్డారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ దగ్గరలోనే సీసీ కెమెరాలో రికార్డు కాగా.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

గుర్గావ్‌ సెక్టార్ 82లోని సిగ్నేచర్ విల్లాస్ అపార్ట్‌మెంట్‌ సముదాయం దగ్గర శుక్రవారం ఉదయం నుంచి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిస్తోంది. దీనితో వర్షంలో తడవకుండా ఉండేందుకు నలుగురు వ్యక్తులు చెట్టు కిందకు చేరారు. అకస్మాత్తుగా వారిపై పిడుగు పడింది. అంతే ఇంకేముంది క్షణాల్లో వారంతా పిట్టల్లా కుప్పకూలిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు.

ఇదిలా ఉంటే పిడుగులు పడేటప్పుడు తమని తాము రక్షించుకునేందుకు చెట్లు, భవనాల కిందకు వెళ్లడం మరింత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. పిడుగులు ఎత్తైన వాటిని ఆకర్షిస్తాయని.. అందుచేత వాటికి దూరంగా ఉండటం మంచిదని వారు సూచిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!