Honeymoon: పెళ్లై ఐదు నెలలు అయినా శోభనానికి అంగీకరించని భార్య.. ఏంటా అని ఆరాతీసిన భర్తకు ఫ్యూజుల్ ఔట్..!

Honeymoon: ఆ ఇద్దరికీ పెళ్లై ఐదు నెలలు అవుతోంది. కానీ ఇద్దరూ శారీరకంగా కలిసింది లేదు. పెళ్లైంది మొదలు.. ప్రతిసారి భార్య..

Honeymoon: పెళ్లై ఐదు నెలలు అయినా శోభనానికి అంగీకరించని భార్య.. ఏంటా అని ఆరాతీసిన భర్తకు ఫ్యూజుల్ ఔట్..!
Representative Image
Follow us
Shiva Prajapati

| Edited By: Team Veegam

Updated on: Mar 14, 2021 | 11:29 AM

Honeymoon: ఆ ఇద్దరికీ పెళ్లై ఐదు నెలలు అవుతోంది. కానీ ఇద్దరూ శారీరకంగా కలిసింది లేదు. పెళ్లైంది మొదలు.. ప్రతిసారి భార్య ఏదో ఒక సాకు చెబుతూ భర్తను దూరం పెడుతూ వచ్చింది. దాంతో విసిగిపోయిన భర్త.. విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపాడు. అత్తామామలు తన కోడలిని సమస్య ఏంటని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం కలిగి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. దాంతో అసలు విషయం బయటపడింది. డాక్టర్స్ రిపోర్ట్ చూసి కంగుతినడం యువకుడి కుటుంబ సభ్యుల వంతైంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. షహరాన్‌పూర్‌ కు చెందిన యువకుడికి గతేడాది అక్టోబర్ 28న ముజఫర్ నగర్‌కు చెందిన యువతితో పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాలు పెళ్లి తంతుని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కొత్త కోడలు ఇంట్లోకి అడుగపెట్టడంతో వరుడి తల్లిదండ్రులు సైతం తెగ సంబరపడిపోయారు. అయితే అసలు కథ ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. పెళ్లైన మరుసటి రోజునే వారిద్దిరికీ శోభనం ఏర్పాటు చేశారు పెద్దలు. కానీ, ఏవో కారణాలు చెబుతూ ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఏవే సాకులు చెబుతూ.. భర్తను దగ్గరకు రానివ్వకుండా దూరంగా ఉంటూ వస్తోంది. దాంతో విసిగిపోయిన భర్త విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఆమెపై అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ రిపోర్ట్‌ను చూసిన భర్తకు, అతని కుటుంబ సభ్యులకు ఫ్యూజులు అవుట్ అయ్యాయి. కారణం.. వధువు ట్రాన్స్ జెండర్ అని వైద్యులు తేల్చారు. ఆ రిపోర్ట్‌ను చూపుతూ అమ్మాయి కుటుంబ సభ్యులు తమను మోసం చేశారంటూ యువకుడు, అతని కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. మోసం చేసి తమకు ట్రాన్స్‌జెండర్‌ను ఇచ్చి పెళ్లి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ అమ్మాయి కూడా తన అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బలవంతంగా నిర్బంధించారని ఆరోపిస్తూ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, యువకుడి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులను కూడా స్టేషన్‌కు పిలిపించారు.

పోలీసులు ఇరువురి కుటుంబాలను స్టేషన్‌కు రప్పించడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. భార్యను ఇంటికి తీసుకెళ్లేది లేదని యువకుడు తేల్చి చెప్పాడు. అమె ట్రాన్స్‌జెండర్ అని, తన ఆరోపణల తాలూకు మెడికల్ రిపోర్ట్‌ను పోలీసులకు చూపించాడు. అమ్మాయి ట్రాన్స్‌జెండర్ అనే విషయాన్ని ఉద్దేశ్య పూర్వకంగా దాచి తనకిచ్చి పెళ్లి చేశారని యువకుడు ఆరోపించాడు. పెళ్లై 5 నెలలు అయినా కనీసం దగ్గరకు రానివ్వలేదని, వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఆమె ట్రాన్స్‌జెండర్ అని తేలిందన్నాడు.

Also read: ఆ ప్రాంతాల్లో వానర వనాలుగా మారిన ఊర్లు.. జనాభా కంటే కోతులే ఎక్కువయ్యాయి.. జనాల్ని టార్చెర్ చేస్తున్నాయి

ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోగలరా..! ట్రై చేయండి.. ఫన్నీ వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ..

ఏపీలో వెలువడుతున్న మున్సిపల్ ఫలితాలు… కొనసాగుతున్న వైఎస్ఆర్‌సీపీ హవా