ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోగలరా..! ట్రై చేయండి.. ఫన్నీ వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ..

Smriti Irani Shares Funny Video : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడు ఏ సంఘటన

ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోగలరా..! ట్రై చేయండి.. ఫన్నీ వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ..
Smriti Irani Shares Funny V
Follow us

|

Updated on: Mar 13, 2021 | 4:56 PM

Smriti Irani Shares Funny Video : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా తన గళం వినిపిస్తుంది. బర్నింగ్ టాఫిక్‌పై నెటిజన్లతో చర్చిస్తుంది. ఈ క్రమంలో డిఫరెంట్ ఇండియన్ రెసిపీస్, ట్రెడిషన్స్‌పై కూడా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఇన్‌స్టా వేదికగా తను షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. కాగా ఈ వీడియోను ముంబై పోలీస్ శాఖ తమ ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేయగా, నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

#fantasticfriday, #dostonperehemkaro హ్యాష్‌ట్యాగ్స్‌తో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ వీడియో షేర్ చేసింది. దీనిని చూసి పలువురు నెటిజన్లు వారి ప్రదర్శన ‘సూపర్బ్’ అని ప్రశంసలు కురిపిస్తుండగా.. ‘మార్చి నెలలో ఉద్యోగులు ఈ వీడియోలో మాదిరి పర్ఫార్మ్ చేస్తారని’ కొందరు కామెంట్ చేస్తున్నారు. ముంబై పోలీస్ విభాగం మాత్రం ఈ వీడియోను హ్యాకర్స్ పట్ల ప్రజల్లో అవేర్‌నెస్ క్రియేట్ కోసం యూజ్ చేయడం విశేషం. ఇన్‌స్టా హ్యాండిల్‌లో ‘మీరు కనుక వీక్ పాస్‌వర్డ్ పెట్టుకున్నట్టయితే హ్యాకర్స్ ఈజీగా మీ అకౌంట్లోకి ఎంటరై ఇలా ఎంజాయ్ చేస్తారని’ పేర్కొంటూ స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఫర్ అకౌంట్స్ ఇంపార్టెన్స్ తెలిపే ప్రయత్నం చేశారు.

వీడియోలో నలుగురు సంగీతకారులు ఒకే వేదికపై కూర్చుని సంప్రదాయ దుస్తులను ధరించి, తబలా మరియు హార్మోనియంతో సహా వాయిద్యాలను వాయిస్తూ ఉంటారు. చాలా శక్తి వంతమైన హావా భావాలతో ప్రదర్శన చేస్తూ ఉంటారు. వారి ముఖ కవలికల్లో చూపించే హావా భావాలను చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం. ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయిన తరువాత, చాలామంది నలుగురు పురుషుల ఉత్సాహాన్ని జీవితంలో వివిధ సాపేక్ష పరిస్థితులతో పోల్చుకుంటున్నారు.

మరిన్ని చదవండి : China dam on Brahmaputra : దాయాది దేశాల్ని కలవరపెడుతున్న బ్రహ్మనపుత్ర నదిపై డ్రాగన్ కంట్రీ డ్యామ్

ఆ పులి కనిపిస్తే కాల్చి చంపేయండి.. అటవీ శాఖ అధికారులకు మంత్రి ఆదేశం.. పులి దాడిలో నలుగురు మృతి