Viral Photo Shoot: కొత్త జంట పెళ్లి ఫొటో షూట్‌పై మండి పడుతోన్న నెటిజెన్లు.. ఇంతకీ వాళ్లేం చేశారనేగా..?
Photo Shoot With Lion Cub: ఇటీవల ఫొటో షూట్ కల్చర్ బాగా పెరిగిపోతోంది. పెళ్లి నుంచి మొదలు పెడితే పుట్టిన రోజు వేడుక వరకు ఇలా ప్రతీ సందర్భానికి ఫొటో షూట్‌లు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో నలుగురు చేసింది చేస్తే వెరైటీ ఏముంటుందన్నట్లుగా...
Photo Shoot With Lion Cub: ఇటీవల ఫొటో షూట్ కల్చర్ బాగా పెరిగిపోతోంది. పెళ్లి నుంచి మొదలు పెడితే పుట్టిన రోజు వేడుక వరకు ఇలా ప్రతీ సందర్భానికి ఫొటో షూట్‌లు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో నలుగురు చేసింది చేస్తే వెరైటీ ఏముంటుందన్నట్లుగా కొందరు రకరకాల విన్యాసాలు చేస్తూ మరీ ఫొటో షూట్‌లు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అలాంటి చాలా ఫొటో షూట్‌లకు సంబంధించిన వార్తలు మనం చూశే ఉంటాం.
తాజాగా ఇస్లామాబాద్‌లో ఇలాంటి ఓ ఫోటోషూట్‌పై ప్రజలు మండిపడతున్నారు. వివరరాల్లోకి వెళితే.. లాహోర్‌కు చెందిన ఓ కొత్త జంట వెడ్డింగ్ షూటింగ్ తీసుకోవాలనుకుంది. ఇందుకోసం వారు ఏకంగా సింహం పిల్లలను తీసుకొచ్చారు. సింహం పిల్లను పక్కన పెట్టుకొని ఫొటోలకు పోజిచ్చారు. ఈ వెడ్డింగ్ ఫొటోలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక ఈ ఫొటో షూట్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు. మూగ జీవాలను అలా ఎలా అద్దెకు ఇస్తారంటూ మండి పడుతున్నారు. సదరు ఫొటో షూట్ చేసిన స్టూడియోపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సింహం పిల్లలకు మత్తు ఇచ్చి మరీ ఈ చర్యకు దిగడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీడియోను పాకిస్థాన్‌కు చెందిన ‘సేవ్ ద వైల్డ్’ అనే స్వచ్చంధ సంస్థ ట్వీట్ చేసింది. సింహాం పిల్లలతో ఫొటో షూట్ నిర్వహించిన వారినపై చర్యలు తీసుకోవాలని వన్య ప్రాణుల సంరక్షణ శాఖకు ఫిర్యాదు చేసింది.
@PunjabWildlife does your permit allow for a lion cub to be rented out for ceremonies?Look at this poor cub sedated and being used as a prop.This studio is in Lahore where this cub is being kept.Rescue him please pic.twitter.com/fMcqZnoRMd
— save the wild (@wildpakistan) March 7, 2021
Also Read: Viral News: వారెవ్వా…. ఆవు, దూడకు నగలు చేయించాడు.. రోల్డ్ గోల్డ్ కాదు.. బంగారం, వెండితో