Goolgle Maps: గూగుల్ మ్యాప్స్‌లో మరో కొత్త ఫీచర్… ఇకపై మీరూ మ్యాప్స్‌ను ఎడిట్ చేయొచ్చు..
Goolgle Maps New Feature: ఒకప్పుడు ఏదైనా అడ్రస్ చెప్పాలంటే పలానా వీధి నుంచి వచ్చి.. పలానా షాపు వద్ద రైట్ తీసుకో అని చెప్పేవారు. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి రావడంతో జస్ట్ లొకేషన్ షేర్ చేస్తే..
Goolgle Maps New Feature: ఒకప్పుడు ఏదైనా అడ్రస్ చెప్పాలంటే పలానా వీధి నుంచి వచ్చి.. పలానా షాపు వద్ద రైట్ తీసుకో అని చెప్పేవారు. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి రావడంతో జస్ట్ లొకేషన్ షేర్ చేస్తే సరిపోతుంది. ఎంచక్కా వాయిస్ కమాండ్స్ ఆధారంగా డెస్టినేషన్ చేరుకోవచ్చు. ఇక యూజర్ల అవసరాల మేరకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది కాబట్టే గూగుల్ మ్యాప్స్‌కు అంత ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే గూగుల్ మ్యాప్స్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఉదాహరణకు మీరు గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఓ మార్గంలో వెళుతుంటారు. కానీ మ్యాప్స్ మీకు తప్పుడు సమాచారం చూపిస్తుంది. అలాంటి తప్పుడు సమాచారాన్ని మీరు సరిచేసే అవకాశాన్ని ఈ కొత్త ఫీచర్ ద్వారా పొందొచ్చు. ఇందు కోసం గూగుల్ ‘డ్రాయింగ్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. సదరు మార్గానికి సంబంధించిన వివరాలను మ్యాప్స్‌లో ఎడిట్ చేసే అవకాశాన్ని తీసుకురానున్నారు. మ్యాప్స్‌లో యూజర్ల భాగస్వామ్యాన్ని కూడా పెంచేందుకుగానే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు లొకేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలిపే ‘ఫొటో అప్‌డేట్స్’ ఫీచర్‌ను కూడా గూగుల్ అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త ఫీచర్లను 80 దేశాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ‘ఎడిట్ ది మ్యాప్’ అనే ఆప్షన్ ద్వారా కొత్త రోడ్ల వివరాలను, మిస్ అయిన దారుల వివరాలను అప్‌లోడ్ చేయవచ్చు. మార్పులు చేసిన తర్వాత సబ్‌మిట్ బటన్‌ను నొక్కాలి. ఇలా చేసిన తర్వాత గూగుల్ నుంచి.. ‘ప్రజలను తప్పుదోవ పట్టించేలా సూచనలు ఉండకూడదని’ ఓ అలర్ట్ వస్తుంది. అనంతరం దానికి అంగీకరిస్తే.. గూగుల్ యూజర్లు చేసిన సూచనలను వారంలో మార్చేస్తుంది.
Also Read: YouTube: యూట్యూబర్స్‌కు వార్నింగ్.. ఆరు నెలల్లో 30,000 వీడియోలను తొలగించిన సంస్థ.. కారణమిదే..