AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hippopotamus: నీటి ఏనుగు నోట్లో ప్లాస్టిక్‌ బాటిల్‌ విసిరేసిన మహిళ.. మండిపడుతోన్న నెటిజెన్లు..

Bottle Throwing In Hippopotamus Mouth: కొన్ని సందర్బాల్లో మనుషులు చేసే పనులు చూస్తుంటే అసలు వీరు మనుషులేనా అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. మూగ జీవులపై కొందరు చేసే అమానుష చర్యలు మనిషి తాలుకు మానవత్వాన్నే..

Hippopotamus: నీటి ఏనుగు నోట్లో ప్లాస్టిక్‌ బాటిల్‌ విసిరేసిన మహిళ.. మండిపడుతోన్న నెటిజెన్లు..
Hippopotamus Mouth
Narender Vaitla
|

Updated on: Mar 13, 2021 | 9:01 PM

Share

Bottle Throwing In Hippopotamus Mouth: కొన్ని సందర్బాల్లో మనుషులు చేసే పనులు చూస్తుంటే అసలు వీరు మనుషులేనా అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. మూగ జీవులపై కొందరు చేసే అమానుష చర్యలు మనిషి తాలుకు మానవత్వాన్నే ప్రశ్నిస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియో ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని ఓ సఫారీ పార్కును సందర్శించడానికి వెళ్లింది ఓ మహిళ. ఈ క్రమంలో నీటి ఎనుగు (హిప్పోటామస్‌) ఉన్న ప్రదేశానికి వెళ్లింది. అయితే అంతసేపు బాగానే ఉన్న ఆ మహిళ నీటి ఎనుగును చూసేసరికి చేతిలో ఉన్న వాటర్‌ బాటిల్‌ను దాని నోట్లోకి విసిరేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ మహిళ మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. మూగజీవిపై ఆ మహిళ చేసిన దుశ్చర్య పట్ల నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వాన్ని మరిచిన ఆ మహిళ తీరుపట్ల అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన సదరు మహిళ మాట్లాడుతూ.. ‘నేను చూస్తుండగానే ఆ మహిళ నీటి ఎనుగు నోట్లోకి బాటిల్‌ విసిరింది. నేను ఆ సమయంలో మహిళను అడ్డుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇక ఆ మహిళ కేవలం వాటర్‌ బాటిల్‌ కాకుండా ఇతర చెత్త పదార్థాలను కూడా హిప్పోటామస్‌ నోట్లోకి విసిరింది. ఈ సంఘటను చాలా మంది ప్రత్యక్షంగా చూశారు’ అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by PEEDS? (@peeds.id)

Also Read: Gold ornaments seized: జాతీయ రహదారిపై అధికారుల తనిఖీలు.. 234 కిలోల బంగారు అభరణాల పట్టివేత

LockDown: భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌ విధించిన అధికారులు..

Health Tips: ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు అస్సలు తినకూడదట.. తింటే ప్రమాదమేనంటున్నారు నిపుణులు..!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!