LockDown: భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌ విధించిన అధికారులు..

Again LockDown: గతేడాది యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి ఇప్పుడిప్పుడే చెక్‌ పడుతోందని అంతా భావించారు. వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి రావడంతో ఇక కరోనా పని ఖతం అయ్యిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే..

LockDown: భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌ విధించిన అధికారులు..
Lockdown
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 13, 2021 | 8:34 PM

Again LockDown: గతేడాది యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి ఇప్పుడిప్పుడే చెక్‌ పడుతోందని అంతా భావించారు. వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి రావడంతో ఇక కరోనా పని ఖతం అయ్యిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా జరుగుతోన్న పరిణామాలు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకీ క్రమంగా పెరుగుతోన్న కేసులు భయాదోళలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ విధించిన ప్రదేశాల్లో ఔరంగాబాద్‌ జిల్లా ఒకటి. ప్రస్తుతం ఔరంగాబాద్ జిల్లాలో మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 57,755 నమోదవ్వగా, నిన్నటి వరకు 5,569 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారాంతాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ను విధించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. దీనికి సంబంధించిన ఫొటోలు గతేడాది దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో ఉన్న పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. ఇక నాగ్‌పూర్‌లో కూడా ఈ నెల 21 వరకు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్రాలో శుక్రవారం మూడో రోజు ఈ ఏడాదిలో అత్యధికంగా 15,817 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రాలో కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన పరిణామంగా భావించాలని తెలిపారు. ఇక ప్రజలు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

Also Read: Covid-19 Effect: విమానాశ్రయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..? అయితే నో ఎంట్రీ.. డీజీసీఏ కొత్త రూల్స్‌

Nandigram Fight: బెంగాల్ అంతా ఒకెత్తు.. నందిగ్రామ్ ఒకెత్తు.. అందుకే దీదీ అంత రాద్ధాంతం

Kidney Dialysis Hospital: దేశంలో అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రి.. ఉచితంగా డయాలసిస్‌, భోజనం.. ఎక్కడో తెలుసా..?

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..