Gold ornaments seized: జాతీయ రహదారిపై అధికారుల తనిఖీలు.. 234 కిలోల బంగారు అభరణాల పట్టివేత

Gold ornaments seized:ఈ మధ్య కాలంలో బంగారం పట్టివేత బాగానే జరుగుతున్నాయి. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ఉండటంతో తనఖీలు కూడా ముమ్మరం చేస్తున్నారు అధికారులు..

Gold ornaments seized: జాతీయ రహదారిపై అధికారుల తనిఖీలు.. 234 కిలోల బంగారు అభరణాల పట్టివేత
Follow us

|

Updated on: Mar 13, 2021 | 8:38 PM

Gold ornaments seized:ఈ మధ్య కాలంలో బంగారం పట్టివేత బాగానే జరుగుతున్నాయి. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ఉండటంతో తనఖీలు కూడా ముమ్మరం చేస్తున్నారు అధికారులు. తాజాగా తమిళనాడులో భారీ ఎత్తున బంగారం రవాణా చేస్తుండడాన్ని అధికారులు గుర్తించారు. శాసనసభ ఎన్నికలు తగ్గర పడుతున్న తరుణంలో భారీగా బంగారం పట్టుబడటం కలకలం రేపుతోంది.

సేలం-చెన్నై హైవే మార్గంలో అధికారుల నిర్వహించిన తనిఖీల్లో 234 కిలోల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైం నుంచి సేలం వైపు వస్తున్న ఓ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా, అందులో ఎద్ద ఎత్తున బంగారు అభరణాలు బయటపడ్డాయి. ఈ బంగారానికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

వ్యాన్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నగలను చెన్నైలోని ఓ పేరున్న నగల దుకాణం నుంచి సేలంకు తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ స్థానిక వ్యాపారులకు వీటిని సరఫరా చేయాలని సదరు వ్యక్తులు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. అయితే బంగారాన్ని ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నారా..? లేక మరేదైన కారణంగా ఉందా .. అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

Covid-19 Effect: విమానాశ్రయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..? అయితే నో ఎంట్రీ.. డీజీసీఏ కొత్త రూల్స్‌