జర్నలిస్టులపై దాడి అమానుషం.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు..
Fir Registered Akhilesh Yadav : ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒకచోట జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి.
Fir Registered Akhilesh Yadav : ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒకచోట జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందరో జర్నలిస్టుల హత్యలు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై దాడి చేసినందుకు యూపీ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అఖిలేష్ యాదవ్ సమక్షంలో పార్టీ కార్యకర్తలు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడి భద్రతా సిబ్బంది జర్నలిస్టులను నిర్దాక్షిణంగా నెట్టివేయడంతో వారికి బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరు వర్గాలవారు వేరువేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారని యూపీ శాంతి భద్రతల ఏడీజీ తెలిపారు. వారి ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
అయితే ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతున్నారని సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు వీధిరౌడీల మాదిరిగా జర్నలిస్టులపై దారుణంగా దాడి చేశారని ఆరోపించారు. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ.. జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో భావ ప్రకటన స్వేచ్చ చాలా ముఖ్యమైందని గుర్తుచేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించేలా చేయాలని పేర్కొన్నారు.