AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG : మొదటి మ్యాచ్‌ దెబ్బకి.. భారత క్రికెట్‌ జట్టులో భారీ మార్పులు..! తుది జట్టులో రోహిత్‌ శర్మకి స్థానం..?

Three Changes Team India : భారత్- ఇంగ్లాండ్‌ టీ ట్వంటీ సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన ఇండియా.. రెండో మ్యాచ్‌లో

IND Vs ENG : మొదటి మ్యాచ్‌ దెబ్బకి.. భారత క్రికెట్‌ జట్టులో భారీ మార్పులు..!  తుది జట్టులో రోహిత్‌ శర్మకి స్థానం..?
Three Changes Team India
uppula Raju
|

Updated on: Mar 13, 2021 | 9:04 PM

Share

Three Changes Team India : భారత్- ఇంగ్లాండ్‌ టీ ట్వంటీ సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన ఇండియా.. రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. అందుకోసం జట్టులో భారీ మార్పులు చేయనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం రెండో మ్యాచ్‌ జరగనుంది. అయితే తుది జట్టులోకి రోహిత్ శర్మకి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

తొలి టీ20లో అనవసరపు ప్రయోగాలు చేసి చావుదెబ్బ తిన్న భారత్ ఈసారి జట్టు కూర్పు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే మొదటి మ్యాచ్‌లో అంతగా ప్రభావం చూపని లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌, పేసర్‌ శార్థూల్‌ ఠాగూర్‌ల స్థానాల్లో లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ రాహుల్‌ చాహర్‌, మీడియం పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గణాంకాల ప్రకారం చూసినా రోహిత్‌, రాహుల్‌ల జోడీకి ఓపెనర్లుగా మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో వీరి జోడీ రెండో టీ20లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రోహిత్‌ శర్మ రీ ఎంట్రీ, రాహుల్‌, దీపక్‌ చాహర్‌లకు తుది జట్టులో అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 44 పరుగులిచ్చిన చాహల్‌ స్థానంలో దేశవాళీ టోర్నీలో మంచి ఫామ్‌ను కనబర్చిన రాహుల్‌ చాహర్‌ను, తొలి మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేయగలిగిన శార్థూల్‌ స్థానంలో పేసర్‌ దీపక్‌ చాహర్‌ను భర్తీ చేసే యోచనలో జట్టు ఉన్నట్లు సమాచారం.

Hippopotamus: నీటి ఏనుగు నోట్లో ప్లాస్టిక్‌ బాటిల్‌ విసిరేసిన మహిళ.. మండిపడుతోన్న నెటిజెన్లు..

Gold ornaments seized: జాతీయ రహదారిపై అధికారుల తనిఖీలు.. 234 కిలోల బంగారు అభరణాల పట్టివేత

ధోని ఆటను సీరియస్‌గా తీసుకుంటాడు.. నమ్మకానికే మొదటి ప్రాధాన్యత.. అందుకే కొనసాగిస్తామంటున్న..