AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధిక వడ్డీ ప్రచారాలను నమ్మితే అసలుకే ఎసరు.. కృష్ణా జిల్లాలో బోర్డు తిప్పేసిన మరో సంస్థ

చుక్క చుక్క కలిస్తే సముద్రం...అలానే రూపాయి రూపాయి కూడబెడితే ..చిన్న మొత్తాలు పెద్ద మొత్తం అవుతాయి. ఇది నిజం. కానీ ఈ మాట చాటున కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు.

అధిక వడ్డీ ప్రచారాలను నమ్మితే అసలుకే ఎసరు.. కృష్ణా జిల్లాలో బోర్డు తిప్పేసిన మరో సంస్థ
foreign payment transfer
Ram Naramaneni
|

Updated on: Mar 13, 2021 | 9:18 PM

Share

చుక్క చుక్క కలిస్తే సముద్రం…అలానే రూపాయి రూపాయి కూడబెడితే ..చిన్న మొత్తాలు పెద్ద మొత్తం అవుతాయి. ఇది నిజం. కానీ ఈ మాట చాటున కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. అధిక వడ్డీ ఎరగా వేసి సామాన్యుల కలల్ని చిధ్రం చేస్తున్నారు కేటుగాళ్లు. ఏకంగా అమరావతి పేరిట లక్షల్లో కుచ్చుటోపి పెట్టిన వైనం కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది.

అప్పట్లో అగ్రిగోల్డ్‌.. రీసెంట్‌ కృష్ణా కోపరేటవ్‌ బ్యాంకులో సాగు రుణాల పేరిట స్కామ్‌.. తాజాగా ఇదిగో మరో బోర్డుతో సామాన్యులను బురిడీ కొట్టించిన వైనం బయటపడింది. అమరావతి క్యాపిటల్‌ మ్యూచువల్‌..మల్లిపర్పస్‌ కోపరేటివ్‌ సొసైటీ ..తాటికాయంత అక్షరాలు..చాతడంతా పేరుతో ఈ సంస్థ బడా మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ స్కీమ్‌తో లక్షల్లో స్కామ్‌కు తెరదీసింది.

విజయవాడ కేంద్రంగా 2019లో అమరావతి క్యాపిటల్ కోపరేటివ్ సొసైటీ ఏర్పడింది. విజయవాడ నూజివీడు, తిరువూరు, పామర్రు, గుడివాడలో నెట్‌ వర్క్‌ మొదలెట్టింది. చిరువ్యాపారులు, మధ్య తరగతి, సామాన్య ప్రజలే టార్గెట్‌గా అధిక వడ్డీ మంత్రమేశారు నిర్వాహాకులు. రోజుకు వంద..ఆపై ఎంతైనా తమ బ్యాంకులో జమ చేస్తే రెండేళ్లలో 8 శాతం వడ్డీతో పెద్ద మొత్తం ఇస్తామని ప్రచారం చేశారు. నిజమేనని నమ్మి చాలా మంది డిపాజిట్లు చేశారు. కానీ టర్మ్‌ పూర్తయినా డబ్బు మాత్రం ఇవ్వడంలేదంటూ ఆందోళనకు దిగారు ఏజెంట్లు, ఖాతాదారులు.

ఖాతాదారులు, ఏజెంట్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధిక వడ్డీతో భారీ రిటర్న్స్‌ అని ఎరవేసి ఎంత దండుకున్నారు? ఈ స్కామ్‌లో ఎవరెవరి హస్తం వుందో త్వరలోనే లెక్క తేలుస్తామన్నారు నూజీవీడు డీఎస్పీ శ్రీనివాస్‌.  అధిక వడ్డీ ప్రచారాలను నమ్మితే అసలుకే ఎసరు రావడం ఖాయం. ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదంలేని సంస్థలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని సూచించారు పోలీసులు.

Also Read:

AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు

Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్…