మైనర్‌తో పెళ్లి చేయాలని యువకుడు హల్‌చల్‌.. పోలీస్ స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..

Man Tries To Commit Suicide : ప్రేమ, పెళ్లి విషయంలో కొందరు యువకులు ఎంత చెప్పినా వినడం లేదు. మూర్ఖంగా తాను అనుకున్నది

మైనర్‌తో పెళ్లి చేయాలని యువకుడు హల్‌చల్‌..  పోలీస్ స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
Suicide
Follow us
uppula Raju

|

Updated on: Mar 13, 2021 | 7:58 PM

Man Tries To Commit Suicide : ప్రేమ, పెళ్లి విషయంలో కొందరు యువకులు ఎంత చెప్పినా వినడం లేదు. మూర్ఖంగా తాను అనుకున్నది అయ్యేసరికి మంకు పట్టుబడుతున్నారు. లేదంటే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల కన్న తల్లిదండ్రులు, వారిపై ఆధారపడిన వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనవసరంగా స్తబ్దుగా ఉన్న కుటుంబాలను రోడ్డున పారేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఒడిశా రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఒడిశాలోని భువనేశ్వర్‌లో మైనర్ బాలికతో వివాహం చేయాలని ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్‌కు పెట్రోల్ బాటిల్‌తో వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. భువనేశ్వర్‌, గజపతి నగర్‌కు చెందిన అజయ్‌ దొర అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌(16)ను ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులు ఆమెను రాజస్తాన్‌లోని బంధువుల ఇంటికి పంపేశారు.

ఈ విషయంపై మాట్లాడడానికి ఆ యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. పోలీసులతో మాట్లాడుతూ తాను ఒక అమ్మాయిని ప్రేమించానని తనకు, ఆ అమ్మాయితో పెళ్లి చేయాలని డిమాండ్ చేశాడు. వారు ఆ అమ్మాయి మైనర్ అని నచ్చచెప్పేందకు ప్రయత్నించారు. దీంతో అతడు బ్యాగులోని పెట్రోల్‌ బాటిల్‌ తీసి పెట్రోల్‌ మీద పోసుకున్నాడు. అనంతరం అగ్గిపెట్టె తీసుకుని అంటించుకోవటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ వెంటనే అతడ్ని అరెస్ట్‌ చేశారు.

బుర్ఖా తీవ్రవాదానికి నిదర్శనం, దీన్నిత్వరలో నిషేధిస్తాం, శ్రీలంక మంత్రి ప్రకటన

Goolgle Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో మరో కొత్త ఫీచర్‌… ఇకపై మీరూ మ్యాప్స్‌ను ఎడిట్‌ చేయొచ్చు..

Covid-19 Effect: విమానాశ్రయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..? అయితే నో ఎంట్రీ.. డీజీసీఏ కొత్త రూల్స్‌