AP Municipal Elections 2021: ఏపీ మున్సిపల్‌ కౌంటింగ్‌… 11 కార్పోరేషన్‌లలో 16 కౌంటింగ్ కేంద్రాలు

AP Municipal Elections 2021: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది...

AP Municipal Elections 2021: ఏపీ మున్సిపల్‌ కౌంటింగ్‌... 11 కార్పోరేషన్‌లలో 16 కౌంటింగ్ కేంద్రాలు
Follow us

|

Updated on: Mar 13, 2021 | 9:23 PM

AP Municipal Elections 2021: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పోరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత,144 సెక్షన్ ఏర్పాటు చేశారు.

11 కార్పోరేషన్లలో 16 కౌంటింగ్ కేంద్రాలు

► విజయనగరం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- పాత బస్టాండ్ సమీపంలో రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్

► విశాఖపట్నం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం, వాల్తేరు

► విజయవాడ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- ఆంధ్ర లయోలా కళాశాల

► మచిలీపట్నం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- కృష్ణా యూనివర్సిటీ

► గుంటూరు కార్పోరేషన్‌లో నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

ఏ)ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బి)ప్రభుత్వ టెక్స్ టైల్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ న్యూబ్లాక్‌ సి) నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ డి)ప్రభుత్వ టెక్స్ టైల్స్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ ఓల్డ్ బ్లాక్

► ఒంగోలు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- సెయింట్ క్సావియర్ హైస్కూల్‌ కళాశాల

►అనంతపురం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు -ఎస్‌ఎస్ బీఎమ్ జూనియర్ కళాశాల

► కర్నూలు కార్పోరేషన్‌లో 3 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు

ఏ)రాయలసీమ యూనివర్సిటీ బి)సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల సి)పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల

► చిత్తూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు – పీవీకెఎన్ ప్రభుత్వ కళాశాల

► తిరుపతి కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు – ఎస్ వీ ఆర్ట్స్ కళాశాల మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎక్కడికక్కడ అన్ని వార్డులను కలిపి ఒకే కేంద్రంలో ఓట్ల లెక్కింపు

► కడప కార్పోరేషన్ లో ఓట్ల లెక్కింపు -ఆర్ట్ కాలేజిలో లెక్కింపు

కాగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 పోలీసు సిబ్బంది నియమించారు. ఇందులో 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు ఉన్నారు. కౌంటింగ్ వద్ద 1345 మంది ఎస్‌ఐలు, 17,292 మంది కానిస్టేబుళ్లు, ఇతరులు 1,134 మందిని ఏర్పాటు చేశారు.