AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వారెవ్వా…. ఆవు, దూడకు నగలు చేయించాడు.. రోల్డ్ గోల్డ్ కాదు.. బంగారం, వెండితో

జంతువులు, మానవుల మధ్య సంబంధం చాలా మధురంగా ​​ఉంటుంది. మానవులు తమ పెంపుడు జంతువులపై, జంతువులు వాటి యజమానులపై అపారమైన ప్రేమ చూపించిన...

Viral News: వారెవ్వా.... ఆవు, దూడకు నగలు చేయించాడు.. రోల్డ్ గోల్డ్ కాదు.. బంగారం, వెండితో
Gold For Cow
Ram Naramaneni
|

Updated on: Mar 13, 2021 | 8:58 PM

Share

జంతువులు, మానవుల మధ్య సంబంధం చాలా మధురంగా ​​ఉంటుంది. మానవులు తమ పెంపుడు జంతువులపై, జంతువులు వాటి యజమానులపై అపారమైన ప్రేమ చూపించిన ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. జంతువులతో ఉంటే మానసిక స్వాంతన ఉంటుందని, అవి కల్మషం లేని ప్రేమని చూపిస్తాయని చాలామంది చెబుతారు. కాగా తన ఇంటి పాడి పశువులను అలరింకరించడానికి నగలు చేయించిన వ్యక్తుల్ని ఎప్పుడైనా చూశాారా? గుజరాత్‌కి చెందిన అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాం.

గుజరాత్ నివాసి అయిన విజయ్ పార్సనా తన ఆవును, దూడను ఎంతగానో ప్రేమిస్తున్నాడు.  ఈ క్రమంలో వాటి కోసం నగలు తయారు చేయాలని అనుకున్నాడు. ఈ ఆభరణాలు ఏమి రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ కాదండి.  బంగారు, వెండి రత్నాలతో చేసినవి. ఇందుకోసం ఏబి జ్యువెలర్స్ యజమాని మనోజ్ సోనితో మాట్లాడాడు. మనోజ్ నగలు తయారు చేయడానికి అంగీకరించాడు కాని దానికి పెద్ద షరతు పెట్టాడు. విజయ్ తన ఆవును షోరూంకు తీసుకువచ్చినప్పుడే ఆభరణాలు ఇస్తానని చెప్పాడు.

ఈ షరతు అంగీకరించిన విజయ్ నగలు తయారైన అనంతరం, తన ఆవును, దూడను తీసుకొని షో రూమ్‌కి చేరుకున్నాడు. అక్కడ మనోజ్ సోని ఆవును అలంకరించడమే కాదు, గోమాతమై తనకున్న ప్రేమను కూడా ప్రదర్శించాడు. ఆవు-దూడపై పూల వర్షం కురిపించాడు. ఈ సమయంలో విజయ్ కుటుంబంతో పాటు, షో రూమ్ సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. పెళ్లి మండపంలా షో రూం మొత్తం పూలతో అలంకరించారు. వాటిని బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించిన అనంతరం ఆవు, దూడలకు పండ్లను తినిపించి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, ప్రజలు  విజయ్ జంతు ప్రేమను, మనోజ్ ఔదార్యాన్ని అభినందిస్తున్నారు. ఈ మొత్తం వేడుక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read:

AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు

Telangana: ఓ పురాతన గడీ నుంచి పట్టపగలు పెద్ద, పెద్ద శబ్ధాలు.. స్థానికులు వెళ్లి చూడగా షాక్…

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..