AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పులి కనిపిస్తే కాల్చి చంపేయండి.. అటవీ శాఖ అధికారులకు మంత్రి ఆదేశం.. పులి దాడిలో నలుగురు మృతి

ఈ మధ్య కాలంలో గ్రామాల్లోకి పులులు అధికంగా వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లోకి వస్తూ ప్రజలపై దాడికి తెగబడుతున్నాయి. పులుల దాడి వల్ల ఎందరో..

ఆ పులి కనిపిస్తే కాల్చి చంపేయండి.. అటవీ శాఖ అధికారులకు మంత్రి ఆదేశం.. పులి దాడిలో నలుగురు మృతి
Subhash Goud
|

Updated on: Mar 13, 2021 | 4:41 PM

Share

ఈ మధ్య కాలంలో గ్రామాల్లోకి పులులు అధికంగా వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లోకి వస్తూ ప్రజలపై దాడికి తెగబడుతున్నాయి. పులుల దాడి వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అలాగే అటవీ ప్రాంతాల్లో పశువులపై సైతం దాడి చేసి చంపేస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో పెద్దపులి నలుగురిని హతమార్చింది. అంతేకాకు దాదాపు 16 పెంపుడు జంతువులను సైతం బలి తీసుకుంది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలో సంచలనం సృష్టించిన పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా చిక్కడం లేదు. దీంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఇక ప్రభుత్వం ఆదేశాలతో పులి కనిపిస్తే కాల్చి చంపేందుకు నాగ్‌ర్‌హోళ్‌ అటవీ ప్రాంతాన్ని గాలింపు చర్యలు చేపడుతున్నారు అటవీ శాఖ అధికారులు.

గత వారం రోజుల్లో పులి నలుగురిని బలి తీసుకుంది. పెద్దపులి చంపడంలో అధికారులు విఫలమైతే తామే చంపేందుకు వెళ్తామని కొడగు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నాగర్‌హోళ్‌ అటవీ ప్రాంతంలోని తోటల్లో పని చేస్తున్నకూలీలే లక్ష్యంగా పెద్ద పులి దాడికి తెగబడుతోంది. పశువులు, ఇతర పెంపుడు జంతువులపై దాడికి దిగుతోంది. వారం రోజుల వ్యవధిలోనే నలుగురి హతమార్చింది. మరో 16 పెంపుడు జంతువులను బలి తీసుకోవడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అలాగే ఐదు రోజుల కిందట కూలీ పనికి వెళ్లిన ఓ కుటుంబంపై పులి దాడి చేసింది. ఇందులో ఆ కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు మృతి, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ గ్రామస్తులు స్వచంద సంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి పులిని చంపాలంటూ డిమాండ్‌ చేశారు.

కర్ణాటక అసెంబ్లీకి తాకిన ఆందోళన సెగ..

కాగా, పులిని పట్టుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో ఆ సెగ కర్ణాటక అసెంబ్లీకి తాగింది.. ఈ ఆందోళనతో పులి కనిపిస్తే కాల్చి చంపేలా కర్ణాటక అటవీ శాఖ మంత్రి అరవింద్‌ లింబవళ్లి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు.. పులి కోసం  అటవీ ప్రాంతాన్ని గాలింపు చేపడుతున్నారు. పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని, లేకపోతే కాల్చి చంపుతామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. తుపాకులు, మత్తు కలిగించే బాణాలు తమ వెంట తీసుకెళ్తున్నారు. రక్తం మరిగిన పులి పట్టబడక దప్పదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో పోలీస్ అధికారి సచిన్ వాజే చుట్టూ బిగుస్తున్న ఉచ్ఛు

Covid-19 Effect: ఆ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో మళ్లీ మూతపడిన పాఠశాలలు..ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం