Covid-19 Effect: ఆ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో మళ్లీ మూతపడిన పాఠశాలలు..ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం
Covid-19 Effect: కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు...
Covid-19 Effect: కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు తలలు పట్టుకుంటున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా..కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా పంజాబ్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. పంజాబ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అందుకు చర్యలు కూడా చేపట్టింది. రాష్ట్రంలో 8 జిల్లాల్లో లాక్‌డౌన్ విధించడంతో పాటు పాఠశాలలు సైతం మూసివేశారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి నుంచి మరో నాలుగు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. లుధియానా, పటియాలా, మొహలీ, ఫతేగఢ్, సాహిబ్, జలంధర్, నవాంశహర్, కప్తూర్తలాలలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించారు.
రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి విజయ్ సింగాల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు తిరిగి ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభించనున్నామని, ఉపాధ్యాయులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరవుతున్నారని అన్నారు. ఈ ఏడాది ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో కూడా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అలాగే మాస్క్‌లు ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపడుతున్నారు అధికారులు.
ప్రధానంగా పంజాబ్ రాష్ట్రంలో కోవిడ్ -19 జనవరి 31 న పంజాబ్‌లో కేవలం 2,128 క్రియాశీల కోవిడ్ -19 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే, మార్చి 9 నాటికి, క్రియాశీల కేసుల సంఖ్య 8,522 వరకు పెరిగింది. మార్చి 10 న పంజాబ్‌లో 1,422 తాజా కేసులు నమోదయ్యాయి. మార్చి 11న రాష్ట్రంలో మరో 1,309 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 9,402 క్రియాశీల కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు 1,92,040 కు చేరుకున్నాయి.
ఇవీ చదవండి:
AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు
Corona: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే?
మరోసారి లాక్‌డౌన్.. మార్చి 31 వరకు స్కూల్స్ మూసివేత.! నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.!