అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో పోలీస్ అధికారి సచిన్ వాజే చుట్టూ బిగుస్తున్న ఉచ్ఛు
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ముంబైలోని కార్యాలయంలో తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ముంబైలోని కార్యాలయంలో తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇటీవల అంబానీ ఇంటివద్ద ఓ వాహనంలో పేలుడు పదార్థాల వాహనం ఉండడం, ఆ తరువాత ఆ వాహన యజమానిగా చెబుతున్న ఆటో స్పేర్ పార్టుల డీలర్ మాన్ సుఖ్ హిరేన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర శాసన సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. తన భర్త మరణానికి సచిన్ వాజే కేరణమని, ఆయన వేధింపుల వల్లే తన భర్త మృతి చెందాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా దాని తాలూకు ఎఫ్ ఐ ఆర్ ని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నిండు సభలో చదివి వినిపించారు. వాజేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర విపక్షాలు కూడా ఇదే డిమాండ్ చేయడంతో రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్.. ఈ కేసు దర్యాప్తు ముగిసేవరకు వాజేని తొలగిస్తున్నట్టు ప్రకటించారు.
ఇలా ఉండగా… వాజే శనివారం ఓ వాట్సాప్ స్టేటస్ పెడుతూ తనను ఈ కేసులో తప్పుడుగా ఇరికించారని ఆరోపించారు. ఈ ప్రపంచానికి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. 2004 లో తనకు కలిగిన ఓ అనుభవాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాడు ఓ కేసులో తన తోటి అధికారులే తనను ఇరికించారని, అది ఇప్పటివరకు తేలలేదని తెలిపారు. అప్పుడు తనకు ..ఇంకా 17 ఏళ్ళ ఏళ్ళ ఆశాకిరణం ఉండేదని, అలాగే జీవితం, సర్వీసు అన్నీ ఉండేవని, కానీ ఇప్పుడు అవేవీ లేవని నిరాశగా ఇందులో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసులో తనను ఎన్ఐఎ అధికారులు విచారిస్తారని ఆయన ఏ మాత్రం ఊహించలేదు. తనను ప్రభుత్వం మరో డిపార్ట్ మెంటుకు బదిలీ చేసినా అది తనకు చిన్నతనమని ఆయన భావిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
Megastar Chiranjeevi: మన్మధుడు నాగార్జున పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి… వీడియో
మద్యం మత్తులో పాముతో చెలగాటం ఆడిన ఒక యువకుడు …చివరికి ఏమైందంటే…!! ( వీడియో )