కార్యకర్తలను నవ్వించిన కేటీఆర్, హరీశ్‌‌రావు

మెదక్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అదే పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ చర్చ కారణంగా పార్టీ కార్యకర్తలంతా నవ్వులు పూయించారు. కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో మెదక్ కాంగ్రెస్ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సదర్భంలో మెదక్ నుంచి అత్యధిక మెజారిటీ వస్తుందని హరీశ్ అనగా, కాదు కరీంనగర్ అని కేటీఆర్ అన్నారు. అయితే ప్రస్తుతం మెదక్‌లో సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో ఇక్కడ ఆ […]

కార్యకర్తలను నవ్వించిన కేటీఆర్, హరీశ్‌‌రావు
Follow us
Vijay K

| Edited By: Anil kumar poka

Updated on: Apr 02, 2019 | 1:19 PM

మెదక్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అదే పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ చర్చ కారణంగా పార్టీ కార్యకర్తలంతా నవ్వులు పూయించారు.

కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో మెదక్ కాంగ్రెస్ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సదర్భంలో మెదక్ నుంచి అత్యధిక మెజారిటీ వస్తుందని హరీశ్ అనగా, కాదు కరీంనగర్ అని కేటీఆర్ అన్నారు. అయితే ప్రస్తుతం మెదక్‌లో సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో ఇక్కడ ఆ పార్టీకి మరింత బలం వచ్చిందని, దీంతో మెదక్ ఎంపీ స్థానం నుంచే అత్యధిక మెజారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఆ మెజారిటీలో తనకూ కొంత క్రెడిట్ ఇవ్వాలని హరీశ్ కోరారు. దీంతో అక్కడున్న కార్యకర్తలంతా వీరిద్దరి మధ్య సంభాషణను చూసి బాగా ఆశ్వాదించారు.