Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KRMB: కృష్ణా, గోదావరి నదుల పరిధి గెజిట్‌ నోటిఫికేషన్‌‌పై కేఆర్ఎంబీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి అమలుకు రెడీ!

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు రంగం సిద్ధమైంది. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది.

KRMB: కృష్ణా, గోదావరి నదుల పరిధి గెజిట్‌ నోటిఫికేషన్‌‌పై కేఆర్ఎంబీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి అమలుకు రెడీ!
Krmb Meeting
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 12, 2021 | 5:11 PM

KRMB on Gazette Notification: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు రంగం సిద్ధమైంది. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ జలసౌధలో కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో బోర్డు సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు పాల్గొననున్నారు. గెజిట్ అమలుపై చర్చించారు. ఈ నెల 14నుంచి గెజిట్‌ అమలు కావాల్సి ఉంది. కేఆర్‌ఎంబీ సమావేశంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, ప్రాజెక్టుల ఆధీనం, నిధులు, సిబ్బందిపైనా చర్చించనున్నారు. కొన్ని ప్రాజెక్టులను మాత్రమే బోర్డ్‌ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్రాలు కోరుతున్న పరిస్థితుల్లో ఇవాళ బోర్డు సమావేశమైంది.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించి ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రకటించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు కేఆర్‌ఎంబీ తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి రానున్నాయి. అవుట్‌లెట్ల అప్పగింతకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్‌ఎంబీ కోరింది. అయితే, గెజిట్ నోటిఫికేషన్‌ను కొంతకాలం పాటు నిలిపివేయాలని అయా ప్రభుత్వాలు కోరుతున్నాయి.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు నేపథ్యంలో మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలుండటం వల్ల ప్రస్తుతానికి వీలు కాదని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా ముసాయిదా తయారు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై రెండు బోర్డులూ రెండు ఉపసంఘాలను నియమించాయి. ఇందులో కృష్ణా బేసిన్‌ కీలకమైంది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నుంచి నీటిపారుదల, జెన్‌కోలకు చెందిన నలుగురు చీఫ్‌ ఇంజినీర్లతో పాటు, కృష్ణా బోర్డు నుంచి ఐదుగురు ఉన్నారు. బోర్డుకు చెందిన రవికుమార్‌ పిళ్లై ఈ ఉపసంఘానికి కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ తయారు చేసిన ముసాయిదాపై ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో చర్చించారు. ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి రానున్నట్లు కేఆర్‌ఎంబీ ప్రకటించింది.

ప్రాజెక్టుల కింద 29 కేంద్రాలు..

ఆంధ్రప్రదేశ్‌…

* శ్రీశైలం స్పిల్‌వే

* కుడి విద్యుత్తు కేంద్రం

* పోతిరెడ్డిపాడు

* హంద్రీనీవా ఎత్తిపోతలకు నీటిని తీసుకొనే పంపుహౌస్‌

* ముచ్చుమర్రి పంపుహౌస్‌

తెలంగాణ…

* ఎడమ విద్యుత్తు కేంద్రం

* కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంపుహౌస్‌

* నాగార్జునసాగర్‌ కింద అత్యధికంగా 15 పాయింట్లున్నాయి.

*హెడ్‌వర్క్స్‌, కుడి, ఎడమ కాలువలతోపాటు, ప్రధాన విద్యుత్తు హౌస్‌

* ఎడమ కాలువ కింద ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎ.ఎం.ఆర్‌.పి) లిప్టు

* నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ కింద హెడ్‌వర్క్స్‌, విద్యుత్తు బ్లాక్‌

* పులిచింతల కింద హెడ్‌వర్క్స్‌, విద్యుత్తు బ్లాక్‌

* కేసీకాలువ కింద సుంకేశుల బీ ఆర్డీఎస్‌ కింద క్రాస్‌ రెగ్యులేటర్‌

* తుమ్మిళ్ల ఎత్తిపోతల

Read Also… Woman pulls big van: వెంట్రుకలతో వ్యాన్‎ను అలవోకగా లాగిన మహిళ.. వైరల్‎గా మారిన వీడియో..