AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman pulls big van: వెంట్రుకలతో వ్యాన్‎ను అలవోకగా లాగిన మహిళ.. వైరల్‎గా మారిన వీడియో..

ఓ మహిళ తన తల వెంట్రుకలతో వ్యాన్‎ను అలవోకగా లాగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‎గా మారింది...

Woman pulls big van: వెంట్రుకలతో వ్యాన్‎ను అలవోకగా లాగిన మహిళ.. వైరల్‎గా మారిన వీడియో..
Van
Srinivas Chekkilla
|

Updated on: Oct 12, 2021 | 4:58 PM

Share

ఓ మహిళ తన తల వెంట్రుకలతో వ్యాన్‎ను అలవోకగా లాగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‎గా మారింది. ఈ వీడియో లండన్ నుంచి వచ్చింది. సెంట్రల్ లండన్‌లో ఇటీవల ఒక మహిళ తన వెంట్రుకలను మాత్రమే ఉపయోగించి తన వ్యాన్‌ను పెట్రోల్ బంక్‎కు లాగడం చూపరులను విస్మయానికి గురి చేసింది. కొనసాగుతున్న ఇంధన సంక్షోభం వాహన యజమానులను భయపెడుతుంది. చాలామంది తమ కారు మధ్యలోనే ఆగిపోయేలా ఉన్నాయిని చింతిస్తున్నారు. వాటిని లాగాడానికి బ్రేక్ డౌన్ పుల్లర్లు అవసరమవుతాయని ఆందోళన చెందున్నారు. పెట్రోల్ బంకుల్లో ఇంధనం తక్కువగా ఉండటంతో రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కానీ అనస్తాసియా సావిక్కా తన వ్యాన్‌ను లాగడానికి బ్రేక్‌డౌన్ పుల్లర్ల సహాయం తనకు ఎప్పటికీ అవసరం రాదని నిరూపించింది. ఆమె తన వెంట్రుకలతో వ్యాన్‎ను లాగింది.

ఆమె ఎలా చేసింది? అక్టోబర్ 4న, 34 ఏళ్ల సావిక్కా తన వ్యాన్‎ బంపర్‎కు తాడు కట్టి ఆ తాడును ఆమె జుట్టుకు కట్టుకుని వ్యాన్‎ను లాగింది. ఆమె వ్యాన్‌ను వీధిలోకి లాగి పెట్రోల్ బంక్ వరకు లాక్కెళ్లింది. సావిక్కా నిజానికి ఒక ప్రొఫెషనల్ ‘హెయిర్-హాంగ్ ఏరియలిస్ట్’. సర్కస్‌లో వృత్తిని కొనసాగించడానికి ఆమె తన 20 వ దశకం ప్రారంభంలో బయోకెమిస్ట్రీ నేర్చుకోవడం మానేసింది. అప్పటి నుండి ఆమె తన సమయాన్ని ‘హెయిర్ హ్యాంగింగ్’ కళను పూర్తిగా నెర్చుకోవడం కోసం అంకితం చేసింది.

“నా వెంట్రుకలతో వ్యాన్ లాగడం చాలా కష్టంగా అనిపించింది.” అని ఆమె చెప్పింది. హెయిర్ హ్యాంగింగ్ లేదా హెయిర్ హ్యాంగ్ కొత్త రకం స్టంట్ కాదని. ఇది చైనాలో ప్రారంభమై తర్వాత శతాబ్దాలుగా సర్కస్‎లో భాగంగా ఉందని చెప్పారు. హెయిర్-హాంగింగ్ ఏరియలిస్టులు సాధారణంగా విన్యాసాలు చేసే ముందు వారి జుట్టును షాంప్‎లో కడుగుతారు. ఉదాహరణకు అనస్తాసియా రెండు కండీషనర్ బాటిళ్లను ఉపయోగించడం ద్వారా తన సూపర్ స్ట్రాంగ్ జుట్టును తయారు చేసుకుంటుంది. ఆమె పొడవైన కురులపై $ 1.3 మిలియన్లకు (రూ. 9 కోట్లు) బీమా చేశారు.

Read Also.. Sania Mirza: టచ్ ఇట్ ఛాలెంజ్‎లో పాల్గొన్న సానియా మీర్జా.. ఇన్‎స్టాగ్రామ్‎లో ఫన్ వీడియో పోస్ట్..