Largest Pumpkin: రైతుకి లక్షలార్జించిన భారీ గుమ్మడి కాయ..ప్రపంచంలో రెండో పెద్ద గుమ్మడికాయగా రికార్డ్
Half Moon Bay Pumpkin Festival: కరోనా నిబంధనల నడుమ అమెరికాలోని కాలిఫోర్నియాలో 48వ 'సేఫ్ వే ప్రపంచ ఛాంపియన్‌షిప్' పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సుమారు వెయ్యి..
Half Moon Bay Pumpkin Festival: కరోనా నిబంధనల నడుమ అమెరికాలోని కాలిఫోర్నియాలో 48వ ‘సేఫ్ వే ప్రపంచ ఛాంపియన్‌షిప్’ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సుమారు వెయ్యి కిలోలకు దగ్గరగా ఉన్న గుమ్మడికాయ ఫస్ట్ ప్రైజ్ దక్కించుకుంది. 994 కిలోలున్న ఈ గుమ్మడికాయను పండించిన వాషింగ్టన్‌కు చెందిన జెఫ్.. మొదటి బహుమతిని అందుకున్నారు. ఇందుకుగాను మన కరెన్సీలో సుమారు రూ. 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. అయితే ఇదే జెఫ్ 2017 జరిగిన పోటీల్లో మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు ఈ ప్రైజ్ మనీతో ఏమి చేస్తారు అని అడిగితే తన భార్య , నలుగురు కుమార్తెల గురించి ప్రస్తావించారు. ఇక ఇదే పోటీల్లో నాపాకు చెందిన వారు వరసగా రెండవ, మూడవ బహుమతిని పొందారు. లియోనార్డో యురేనా 2,007 పౌండర్‌తో .. జాన్ హాక్లీ 1,857 పౌండర్‌లతో వరుసగా సెకండ్, థర్డ్ ప్లేస్లో నిలిచారు. .
సూపర్ బౌల్‌గా పిలిచే ఈ పోటీలను కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్ల నుంచి ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. 48 సంవత్సరాల చరిత్రలో పోటీలో ఇది రెండవ భారీ గుమ్మడికాయ. 2020 సంవత్సరంలో ఉత్తర అమెరికాలో నిర్వహించిన పోటీలో అత్యధికంగా 1066 కిలోల గుమ్మడికాయ అతిపెద్ద గుమ్మడికాయ బహుమతిని గెలుచుకుంది. 2017 లో 2,363 పౌండ్ల ఉత్సవంలో జోయెల్ హాలండ్ అతిపెద్ద గుమ్మడికాయ రికార్డును కలిగి ఉన్నారు.
Also Read: Prakash Raj Vs MAA: ‘మా’ రెండుగా చీలిపోనుందా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేయనున్నారా..