Sania Mirza: టచ్ ఇట్ ఛాలెంజ్‎లో పాల్గొన్న సానియా మీర్జా.. ఇన్‎స్టాగ్రామ్‎లో ఫన్ వీడియో పోస్ట్..

కిడి టచ్ ఇట్ అనే సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంది. టచ్ ఇట్‌ ట్రెండింగ్ డ్యాన్స్ ఛాలెంజ్‌తో నెటిజన్లు బిజీగా ఉన్నారు. ఈ ఫన్ ఛాలెంజ్‎తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నిండిపోయింది...

Sania Mirza: టచ్ ఇట్ ఛాలెంజ్‎లో పాల్గొన్న సానియా మీర్జా.. ఇన్‎స్టాగ్రామ్‎లో ఫన్ వీడియో పోస్ట్..
Sania
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 12, 2021 | 4:13 PM

కిడి టచ్ ఇట్ అనే సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంది. టచ్ ఇట్‌ ట్రెండింగ్ డ్యాన్స్ ఛాలెంజ్‌తో నెటిజన్లు బిజీగా ఉన్నారు. ఈ ఫన్ ఛాలెంజ్‎తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నిండిపోయింది. ఈ టచ్ ఇట్ ఛాలెంజ్‎ను టెన్నీస్ స్టార్ సానియా మీర్జా ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో టచ్ ఇట్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆమె ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది.

వీడియోలో మీరు విడిపోతారని మేము పందెం వేసామంటూ క్లిప్ మొదలవుతుంది. తర్వాత ఇంట్లో నిలబడిన సానియా మరో అమ్మాయి తలపై తట్టారు. వీడియోపై ఒక టెక్ట్స్ కూడా రాశారు. దానిలో “హైదరాబాదీ ఆంటీలు ఇలా ఉండాలి” అని రాసి ఉంది. మీరు ఈ విడియో చూస్తే నవ్వుతారని అన్నారు.

ఈ వీడియోకు ఇప్పటికే 66,000 లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి. కిడి ద్వారా టచ్ ఇట్ పాట 2021 లో గోల్డెన్ బాయ్ ఆల్బమ్‌లో విడుదల చేశారు. ఈ పాటలో ఆకట్టుకునే సాహిత్యం, మంచి ట్యూన్ ఉండటంతో తమ ప్లే లిస్ట్‎లో ఈ పాటను చేర్చుకున్నారు.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

Read Also.. Rashid Khan: టాప్ ఫైవ్ టీ20 ఆటగాళ్లను ఎంపిక చేసిన రషీద్ ఖాన్.. ఇండియా నుంచి ఇద్దరికి చోటు.. ఎవరెవరు ఉన్నారంటే..