AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashid Khan: టాప్ ఫైవ్ టీ20 ఆటగాళ్లను ఎంపిక చేసిన రషీద్ ఖాన్.. ఇండియా నుంచి ఇద్దరికి చోటు.. ఎవరెవరు ఉన్నారంటే..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లో అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ టీ 20 ప్రపంచ కప్‌కు ముందు టాప్ ఫైవ్ టీ 20 ఆటగాళ్ల జాబితాను ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రకటించాడు...

Rashid Khan: టాప్ ఫైవ్ టీ20 ఆటగాళ్లను ఎంపిక చేసిన రషీద్ ఖాన్.. ఇండియా నుంచి ఇద్దరికి చోటు.. ఎవరెవరు ఉన్నారంటే..
Rasheed
Srinivas Chekkilla
|

Updated on: Oct 12, 2021 | 3:33 PM

Share

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లో అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ టీ 20 ప్రపంచ కప్‌కు ముందు టాప్ ఫైవ్ టీ 20 ఆటగాళ్ల జాబితాను ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రకటించాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యుత్తమ షార్ట్ ఫార్మాట్ ప్లేయర్స్, ఫ్రాంచైజ్ ఆధారిత షార్ట్ ఫార్మాట్ లీగ్‌ల్లో ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా అతడు ఐదుగురుని ఎంపిక చేశాడు. అయితే ఐదుగురు సభ్యుల జట్టులో మంచి స్పీన్నర్ అయిన రషీద్ తనకు చోటు కల్పించలేదు.

రషీద్ మొదటగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. కోహ్లీ టీ 20ల్లో 139.04 స్ట్రైక్ రేట్‌తో 3159 పరుగులు సాధించాడు. “వికెట్ ఏమైనప్పటికీ విరాట్ మంచి ప్రదర్శన చేస్తాడు” అని రషీద్ వివరించాడు. రెండో వ్యక్తిగా న్యూజిలాండ్ ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఎంచుకున్నాడు. విలియమ్సన్ టీ20ల్లో 31.66 స్ట్రైక్ రేట్‎తో 1805 పరుగులు చేశాడు. ” విలియమ్సన్ ప్రశాంతంగా” ఆడతాడని రషీద్ చెప్పారు.

మూడో ఆటగాడిగా దక్షిణాఫ్రికా లెజెండ్ ఎబీ డివిలియర్స్ రషీద్ ఎంపిక చేశాడు. “విధ్వంసక బ్యాట్స్‌మన్. ఎవరైనా ఏ దశలోనైనా, ఏ వికెట్‌లోనైనా, ఏ బౌలర్‌పై అయినా మీకు వేగంగా పరుగులు చేయగలడు, ఏదైనా షాట్ ఆడగలడు” అని అన్నారు. నాలుగో ఆటగాడిగా వెస్టిండీస్ ఆల్ రౌండర్, వివాదరహిత టీ 20 లెజెండ్ కీరన్ పొలార్డ్, ఐదో వ్యక్తిగా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను రషీద్ ఎంపిక చేశాడు. “ఈ ఇద్దరు కీలకమైన (బ్యాటర్లు) చివరి నాలుగు-ఐదు ఓవర్లలో 80-90 పరుగులు ఛేజ్ చేయగలరు” అని రషీద్ తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మంచి ప్రతిభ కనబరిచిన రషీద్ ఖాన్ ఇప్పుడు తన దేశం ఆఫ్ఘనిస్తాన్ కోసం ఆడనున్నారు. ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ Bలో భారతదేశం, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో కలిసి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ అక్టోబర్ 25న క్వాలిఫయర్‌-1 ఆడనుంది.

Read Also.. ఆర్‌సీబీ హిట్ పెయిర్లలో కోహ్లీదే అగ్రస్థానం.. సీజన్లు మారినా, భాగస్వామ్యాలు మారినా బెంగళూరుతోనే ప్రయాణం