Dinesh Karthik: మాక్స్‌వెల్, క్రిస్టియన్‎కు మద్దతు తెలిపిన దినేష్ కార్తిక్.. గెలుపు, ఓటములు సహజమంటూ వ్యాఖ్యలు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 ఎలిమినేటర్ మ్యా‎చ్‎లో బెంగళూరు ఓడిపోవడంపై ఆ జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్లెన్ మాక్స్‌వెల్, డాన్ క్రిస్టియన్‎ను టార్గెట్ చేస్తూ...

Dinesh Karthik: మాక్స్‌వెల్, క్రిస్టియన్‎కు మద్దతు తెలిపిన దినేష్ కార్తిక్.. గెలుపు, ఓటములు సహజమంటూ వ్యాఖ్యలు..
Dinesh1
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 12, 2021 | 6:33 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 ఎలిమినేటర్ మ్యా‎చ్‎లో బెంగళూరు ఓడిపోవడంపై ఆ జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్లెన్ మాక్స్‌వెల్, డాన్ క్రిస్టియన్‎ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దుర్భషలాడారు. దీనిపై మాక్స్‌వెల్ ట్విట్టర్‎లో ఎందుకు తిడుతున్నారంటూ ప్రశ్నించారు. క్రిస్టియన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. వీరికి మద్దతుగా కొల్‎కత్తా నైట్‎రైడర్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ సోషల్ మీడియా రాతలపై మాట్లాడారు. “సోషల్ మీడియా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రజలు మీమ్‌లు, వీడియోలు, పదాల వాడకం బాగొలేదు” అని అన్నారు.

“ద్వేషపూరిత వాదనను మానుకోండి. క్రికెటర్లు ఆన్‌లైన్ తరచుగా విమర్శలకు గురవుతారు. మేము విమర్శల పట్ల బలమైన వైఖరిని తీసుకోవాల్సిన సమయం వచ్చింది. విజయాలు, ఓటములు ఏ క్రీడలో అయినా ఒక భాగం. మేము కూడా అక్కడే ఉన్నాం ” ” RCB ఈ సీజన్‎లో గొప్పగా ఆడింది. దురదృష్టవశాత్తు ఫైనల్‎కు చేరుకోలేకపోయాం “అని మాక్స్‌వెల్ గతంలో ట్విట్టర్‌లో అన్నారు. సోషల్ మీడియాలో కొన్ని చెత్తలు అసహ్యకరంగా ఉన్నాయని అన్నారు.

“క్రీడాకారులందరికీ ప్రేమ, ప్రశంసలను పంచుకున్న నిజమైన అభిమానులకు ధన్యవాదాలు! దురదృష్టవశాత్తు కొంతమంది భయంకరమైన వ్యక్తులు సోషల్ మీడియాను చెడుకు వేదికగా మార్చారు. ఇది ఆమోదయోగ్యం కాదు !!! దయచేసి వారిలా ఉండకండి !! ! ” అని చెప్పారు. “మీరు నా సహచరులను సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానిస్తే ప్రతిఒక్కరూ బ్లాక్ చేయబడతారని మాక్సీ అన్నారు. అదే సమయంలో క్రిస్టియన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో స్పందించారు. “ఈ రాత్రి నేను గొప్ప ఆడలేదు, కానీ అది క్రీడ. దయచేసి చెత్త రాతలు రాయకండి” అని క్రిస్టియన్ అన్నారు.

Cristian Final

Cristian Final

Read Also.. Virat Kohli: కోహ్లీని ఏడిపించిన ఐపీఎల్ ట్రోఫీ.. భావోద్వేగాన్ని ఆపుకోలేక తోడైన డివిలియర్స్.. నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోన్న వీడియో