Disha Encounter case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎంక్వైరీ స్పీడప్ చేసిన సిర్పూర్కర్ కమిషన్. రెండో రోజు కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారణ
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎంక్వైరీ స్పీడప్ చేసింది సిర్పూర్కర్ కమిషన్. రెండో రోజు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను విచారించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్
Disha Encounter Case – MP Sajjanar: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎంక్వైరీ స్పీడప్ చేసింది సిర్పూర్కర్ కమిషన్. రెండో రోజు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను విచారించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్నారు సజ్జనార్. దిశకేసులో సిర్పూర్కర్ కమిషన్ ఎదుట ఐపీఎస్ సజ్జనార్ హాజరయ్యారు. వరుసగా రెండో రోజు విచారణకు వచ్చారు. దిశ కేసు ఎన్‌కౌంటర్ టైమ్‌లో సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ఉన్నారు. దిశ ఘటన పరిణామాల తర్వాత ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులపై కమిషన్ విచారిస్తోంది. ఈ కేసులో అప్పటి సీపీ సజ్జనార్ స్టేట్‌మెంట్ కీలకంగా మారుతోంది. ఇప్పటికే సిట్ ఇంచార్జ్ మహేష్ భగవత్, హోంశాఖ కార్యదర్శి, బాధిత కుటుంబాలు, ప్రత్యక్ష సాక్షులు, డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ అధికారులను కమిషన్ విచారించింది.
ఈ కేసులో సీపీ సజ్జనార్ స్టేట్‌మెంట్ కీలకం కావడంతో వివిధ కోణాల్లో కమిషన్ ప్రశ్నించింది. దిశపై అత్యాచారం, హత్య ఘటనతో పాటు నిందితుల అరెస్ట్, ఎన్‌కౌంటర్ తీరుపై ప్రశ్నలవర్షం కురిపించింది. ఐతే ప్రతిరోజూ జరిగే సెట్‌కాన్ఫరెన్స్‌లో భాగంగా శంషాబాద్ డిసిపి ప్రకాశ్‌రెడ్డి దిశపై అత్యాచారం, హత్య గురించి తెలిపారని సజ్జనార్ కమిషన్‌కు వివరించారు. నిందితులకు సంబంధించిన ప్రతి సమాచారం తనకు డిసిపి చెప్పేవారన్నారు. నిందితుల అరెస్టుకు సంబంధించి నమోదైన రికార్డుల కంటే ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై కమిషన్ సజ్జనార్‌ను ప్రశ్నించింది.
దిశ హత్యాచారం ఘటనకు సంబంధించిన పురోగతిని DCP ప్రకాశ్‌రెడ్డి తనకు వివరించడం వల్లే మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పానని సజ్జనార్ కమిషన్‌కు వివరించారు. 2019 డిసెంబర్ 6వ తేదీన షాద్‌నగర్‌కు సమీపంలోని చటాన్‌పల్లి వద్ద నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌కి గురయ్యారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో పోలీసుల ఆయుధాలతో నింది తులు కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు గతంలో ప్రకటించారు. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హక్కుల సంఘాల నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం సిర్పూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
Read also: AP CM Jagan Aasara: ఏపీలో ఆడపడుచులకు ఆసరా వారోత్సవాల పేరుతో మరో దసరా పండుగ తెచ్చిన జగన్ సర్కారు