AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu encounters: జమ్ము కశ్మీర్‌లో కౌంటర్‌ అటాక్‌ మొదలు పెట్టిన సైన్యం.. ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై కౌంటర్‌ అటాక్‌ మొదలుపెట్టింది భారత సైన్యం. కశ్మీర్‌ లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను

Jammu encounters: జమ్ము కశ్మీర్‌లో కౌంటర్‌ అటాక్‌ మొదలు పెట్టిన సైన్యం.. ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు హతం
Jammu Encounter
Venkata Narayana
|

Updated on: Oct 12, 2021 | 4:44 PM

Share

Jammu encounters – Terrorists Killed: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై కౌంటర్‌ అటాక్‌ మొదలుపెట్టింది భారత సైన్యం. కశ్మీర్‌ లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. రాజోరి సెక్టార్‌లో ఐదుగురు జవాన్ల హత్యకు ప్రతీకారం తీర్చుకుంది. షోపియాన్‌లో వరుసగా రెండో రోజు కూడా ఉగ్రవాదులకు , సైన్యానికి మధ్య ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది.

లష్కర్‌ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. షోపియాన్‌ ప్రాంతంలో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.  ఇక, ఎన్ కౌంటర్లో చనిపోయిన ముగ్గురు లష్కరే తోయిబా-రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌కు చెందినవారుగా గుర్తించారు.

ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది ముఖ్తార్‌షా బీహార్‌కు చెందిన వీరేంద్రపాశ్వాన్‌ అనే వ్యాపారి హత్య కేసులో నిందితుడు. 30 గంటల వ్యవధిలో జమ్ముకశ్మీర్‌లో ఇది ఐదవ ఎన్‌కౌంటర్‌. ఇక ఆ ప్రాంతంలో మరికొంత ముష్కరులు దాగి ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు భద్రతా బలగాలు.

రాజోరి సెక్టార్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌ జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఎల్‌వోసీ దగ్గర అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి.

Read also: Mula Nakshatra: ఏపీ, తెలంగాణ ఆలయాల్లో మూలానక్షత్ర వైభవం