AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs Case: ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్‌, అది మానేసి హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ.. సీన్‌ కట్‌ చేస్తే డ్రగ్స్‌ కేసులో కటకటాల వెనక్కి..

Drugs Case: ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా డగ్స్‌ సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ వయా కోలీవుడ్‌ ఇలా సినిమా ఇండస్ట్రీల్లో డ్రగ్స్‌ సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే ఈ జాడ్యం..

Drugs Case: ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్‌, అది మానేసి హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ.. సీన్‌ కట్‌ చేస్తే డ్రగ్స్‌ కేసులో కటకటాల వెనక్కి..
Narender Vaitla
|

Updated on: Oct 12, 2021 | 3:08 PM

Share

Drugs Case: ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా డగ్స్‌ సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ వయా కోలీవుడ్‌ ఇలా సినిమా ఇండస్ట్రీల్లో డ్రగ్స్‌ సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే ఈ జాడ్యం ఇప్పుడు సాధారణ జనాలను కూడా పాకింది. తాజాగా గుంటూరులో జరిగిన ఓ సంఘటనే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు మత్తుకు బానిసై, చివరికి ఆ మత్తువల్లే కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు పట్టాభిపురానికి చెందిన పాముల రఘురామ్‌ కోటి అనే యువకుడు ఎంబీబీఎస్‌ విద్యనభ్యసించడానికి ఫిలిప్పీన్స్‌ వెళ్లాడు. చదువుకోవడానికి వెళ్లిన ఆ యువకుడు అక్కడ మత్తుకు అలవాటు పడ్డాడు. దీంతో మూడో ఏడాది మధ్యలోనే చదువు ఆపేసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అనంతరం ఎల్‌ఎల్‌బీలో చేరి ప్రస్తుతం మూడో ఏడాది చదువుతున్నాడు. అయితే మత్తును మాత్రం వదల్లేదు. ఆ అలవాటును వ్యాపారంగా మార్చుకున్నాడు. స్నేహితుల ద్వారా గంజాయిని అమ్మడం ప్రారంభించాడు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడం, విద్యా సంస్థలు మూతపడడంతో గుంటూరుకు చేరుకున్న రఘురామ్‌.. ఖర్చుల కోసం గంజాయిని విక్రయించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే లిక్విడ్‌ను గంజాయిని చిన్న చిన్న డబ్బాల్లో పోసి ఇంట్లో దాచుకొని అమ్మడం ప్రారంభించాడు. ఇలా ఒక్కో డబ్బాకు రూ. వెయ్యు వసూలు చేశాడు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో డ్రగ్స్‌ అంశం హల్చల్‌గా మారిన నేపథ్యంలో అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ డ్రగ్స్‌ వ్యవహారంపై ఫోకస్‌ పెట్టమని ఆదేశించడంతో.. డీఎస్పీ సుప్రజ, పట్టాభిపురం సీఐ రాజశేఖర్‌రెడ్డి గంజాయి అమ్మకాలపై ఆరా తీశారు. దీంతో రఘురామకోటి లిక్విడ్‌ గంజాయిని అమ్ముతున్నాడనే సమాచారంతో అతని ఇంటి వద్ద నిఘాపెట్టారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో దాచిన లిక్విడ్‌ గంజాయిని అమ్మడానికి బయటకు వచ్చి ఆటో ఎక్కుతున్న క్రమంలో సీఐ రాజశేఖర్‌రెడ్డి సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. రఘురామ కోటి వద్ద ఉన్న లిక్విడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలో లిక్విడ్‌ గంజాయి దందా..

డ్రగ్స్‌ దందాలో స్మగర్లు కొత్త దారి వెతుక్కున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆకు లేదా పొడి రూపంలో సరఫరా చేస్తుంటే దొరికిపోతున్నామనే కారణంతో గంజాయిని లిక్విడ్‌ రూపంలోకి మార్చి చిన్నచిన్న వ్యాక్సిన్ బాటిళ్ల సైజులో తయారు చేసి వాటిని విద్యార్థులకు సప్లై చేస్తున్నారు.. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ రూపంలో బాక్స్ తయారు చేసి అందులో బాటిళ్లను పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విశాఖలో ఈ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: KTR: రాయచూర్‌ జిల్లాను తెలంగాణలో కలపాలని కోరిన కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే.. కేటీఆర్ స్పందన ఇదే

Viral Video: ఇంట్లోకి దూరి హంగామా చేసిన పిల్ల ఎలుగుబంటి.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Viral Video: ఇంట్లోకి దూరి హంగామా చేసిన పిల్ల ఎలుగుబంటి.. నవ్వులు పూయిస్తున్న వీడియో..