Viral Video: ఇంట్లోకి దూరి హంగామా చేసిన పిల్ల ఎలుగుబంటి.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

సాధారణంగా జంతువులు కొన్ని సందర్భాల్లో చేసే అల్లరి చేష్టలు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఇక పిల్ల జంతువులు చేసే పనులు మరింత ఫన్నీగా

Viral Video: ఇంట్లోకి దూరి హంగామా చేసిన పిల్ల ఎలుగుబంటి.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Viral

సాధారణంగా జంతువులు కొన్ని సందర్భాల్లో చేసే అల్లరి చేష్టలు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఇక పిల్ల జంతువులు చేసే పనులు మరింత ఫన్నీగా ఉంటాయి. కోతులు, ఏనుగులు, ఎలుగు బంటిలు చేసే పనులు కాస్త కామెడీగా ఉంటాయి. ఇవి మనుషుల నుంచి కొన్ని పనులను.. విషయాలను నేర్చుకుంటాయి. ఇక విదేశాల్లో చాలా సందర్భాల్లో ఎలుగుబంట్లు, ఏనుగులు ఇళ్లలోకి చేరి… తెగ హంగామా చేస్తాయి. కొన్ని సార్లు అవి ఇంట్లోకి రాగానే భయం కలిగిన.. అవి చేసే పనులు చూస్తే మాత్రం నవ్వులు పూయిస్తాయి. తాజాగా ఓ పిల్ల ఎలుగుబంటి చేసిన పనులు నవ్వులు పూయిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఓ ఇంట్లోకి ఆవరణలోకి ఓ పెద్ద ఎలుగు బంటి.. దాని పిల్లతో కలిసి గోడ దూకి వచ్చాయి. ఇక ఇంటి ప్రాంగణంలో ఆ పిల్ల ఎనుగుబంటి చేసిన హంగామా మాములుగా లేదు. తల్లి ఎలుగు బంటి ఉన్న గోడను ఎక్కెందుకు పిల్ల ఎలుగుబంటి శతవిధాలుగా ప్రయత్నించింది. పక్కన ఉన్న పూల కుండి ఎక్కగానే.. అది కాస్త కింద పడిపోయింది. దీంతో వెంటనే ఆ పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కి .. గోడను చేరుకోవడానికి ప్రయత్నించింది. ఇక అది కూడా వీలు కాక.. పక్కనే ఉన్న కూర్చి ఎక్కగానే.. అది కాస్త కిందపడిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో పిల్ల ఎలుగు బంటి చూసే అల్లరి చేష్టలు నవ్వులు పూయిస్తున్నాయి. మీరు ఓ లుక్కెయ్యండి..

Also Read: Raashi Khanna: వైట్ లెహాంగాలో అప్సరసగా మారిన రాశీ ఖన్నా.. కుర్రాళ్లు చూపు తిప్పుకోవడం కష్టమే సుమా..(ఫొటోస్)

Anu Emmanuel: చీరకట్టి సోయగాలు విరజల్లుతున్న అందాలు చూడతరమా… అను ఇమ్మాన్యుయేల్‌ ఫొటోస్..

Pushpa: మరోసారి మెస్మరైజ్ చేసిన సిధ్ శ్రీరామ్.. పుష్ప సెకండ్ సింగిల్ శ్రీవల్లి సాంగ్ ప్రోమో అదుర్స్..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu