AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీ ఆత్మ విశ్వాసానికి హ్యాట్సాఫ్ సోదరా!.. విధి రాతను ఓడించి ఒంటి కాలితో..

Viral Video: కలలో జీవం ఉన్నవారు మాత్రమే వారి కలలను నిజ జీవితంలో నెరవేర్చుకుంటారు. చేతులు, కాళ్లు ఉంటే ఏంది.. లేకుంటే ఏంది..

Viral Video: నీ ఆత్మ విశ్వాసానికి హ్యాట్సాఫ్ సోదరా!.. విధి రాతను ఓడించి ఒంటి కాలితో..
Handicaped
Shiva Prajapati
|

Updated on: Oct 12, 2021 | 2:05 PM

Share

Viral Video: కలలో జీవం ఉన్నవారు మాత్రమే వారి కలలను నిజ జీవితంలో నెరవేర్చుకుంటారు. చేతులు, కాళ్లు ఉంటే ఏంది.. లేకుంటే ఏంది.. ఆత్మవిశ్వాసం ఉండాలి గాని. కొంతమంది అన్నీ ఉన్నా.. ఏం చేయలేకపోతుంటారు. మరికొందరు తమకు ఏం లేకపోయినా ఆత్మవిశ్వాసం, గుండె నిబ్బరంతో జీవితంలో రాణిస్తుంటారు. రెండు చేతులు లేకున్నా.. ఎంతో ప్రతిభ కలిగిన వారిని ఎంతోమందిని మనం చూశాం. అలాంటి కోవకు చెందిన వ్యక్తి గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాయి. సాధారణంగా కాలికి చిన్న గాయం అయితేనే.. వామ్మో అంటూ నిట్టూరుస్తాం. మరి ఏకంగా ఒక కాలు లేకుండానే సైకిల్ తొక్కమంటే ఎలా ఉంటుంది?. ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఏళ్లుగా ఒంటి కాలితోనే సైకిల్ తొక్కుతూ.. తన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నాడు.

వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో రాజ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ నరేష్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఒక్క కాలు మాత్రమే ఉన్న నరేష్.. సైక్లింగ్ చేస్తూ కనిపించాడు. అయితే, ఒక పెడల్‌ను కాలితో తొక్కుతుండగా.. మరో పెడల్‌ను చేతి కర్ర సాయంతో నెట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. తన వ్యక్తిగత పనులు, వ్యవహారాలన్నింటినీ ఆ సైకిల్ మీదనే తిరుగుతూ చక్కబెడుతుంటాడట. అయితే, రాజు సైక్లింగ్ చేయడాన్ని చూసి ఆశ్చర్య పోయిన కొందరు.. అతను సైక్లింగ్ చేసే సమయంలో వీడియో తీశారు. తాజాగా ఈ వీడియోను ఐఏఎస్(ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్ ఆఫీసర్) అధికారి అవనీష్ శరణ్ (@AwanishSharan) ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘నెవర్ గివప్’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వికలాంగుడు అయినప్పటికీ.. సైక్లింగ్ చేయడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అతని ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారను. ‘‘రాజు శారీరక వికలాంగుడు మాత్రమే. మానసిక వికలాంగుడు కాదు.’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఈ కర్మయోగి స్ఫూర్తికి వందనం’’ అంటూ మరికొందరు కామెంట్ పెట్టారు. మొత్తానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 56 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Viral Video:

Also read:

Hyderabad News: పొంగి పొర్లిన మందు.. అమ్మాయిలతో చిందులు.. అంతలోనే ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..

PM Narendra Modi: అలాంటి వారితో దేశానికి ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ

Roja: ప్రత్యేకత చాటుకున్న నగరి ఎమ్మెల్యే రోజా.. సీఎం జగన్‎కు ప్రత్యేక శాలువాతో సత్కారం..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..