AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammad Asraf: ఢిల్లీలో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు.. దాడికి ప్లాన్ చేసిన ఉగ్రవాది అరెస్ట్..

ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో అరెస్టైన పాకిస్తానీ ఉగ్రవాది మహ్మద్ అష్రఫ్ అలియాస్ అలీ దేశ రాజధానితో సహా కశ్మీర్ లోయలో అనేక తీవ్రవాద దాడులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది....

Mohammad Asraf: ఢిల్లీలో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు.. దాడికి ప్లాన్ చేసిన ఉగ్రవాది అరెస్ట్..
Ali
Srinivas Chekkilla
|

Updated on: Oct 12, 2021 | 2:23 PM

Share

ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో అరెస్టైన పాకిస్తానీ ఉగ్రవాది మహ్మద్ అష్రఫ్ అలియాస్ అలీ దేశ రాజధానితో సహా కశ్మీర్ లోయలో అనేక తీవ్రవాద దాడులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తాజాగా అతను నవరాత్రి ఉత్సవాల్లో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నాడు. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అతడి కుట్రను భగ్నం చేశారు. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఈ ఉగ్రవాది గత 15 సంవత్సరాలుగా ఢిల్లీలో నివసిస్తున్నాడని తెలిసింది. అతను ఒక భారతీయ అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అతను తన భార్య నుండి విడివిడిగా నివసిస్తున్నాడు.

ఉగ్రవాది అష్రఫ్ ఢిల్లీ స్లీపర్ సెల్స్ పెద్దగా వ్యవరించేవాడు, దేశానికి వచ్చే ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థలు అందించేవాడు. ఇతడికి ఢిల్లీలో నెట్‌వర్క్‌ ఎక్కువగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాది ఆయుధాలను కలింది కుంజ్ సమీపంలో యమునా ఒడ్డున ఇసుక కింద పాతిపెట్టాడు. ఇతడితో సంబంధం ఉన్న మరికొంతమందిని త్వరలో అరెస్టు చేయవచ్చని ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం తెలిపింది. మహ్మద్ అష్రఫ్ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అష్రఫ్ ఢిల్లీలో మౌలానాగా వ్యవహరిస్తుండేవాడు. ఇతడికి ఇతర ఉగ్రవాదుల నుంచి VOIP కాల్స్ వచ్చేవి, దీంతో దర్యాప్తుఏజెన్సీలు వాటిని పసిగట్టలేకపోయాయి. ఉగ్రవాది మొబైల్ ఫోన్ వద్ద పాకిస్తాన్‎కు చెందిన అనేక మంది మొబైల్ నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అతడిని ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లోని రమేష్ పార్క్ ప్రాంతంలో పట్టుకున్నారు. అష్రఫ్ ఢిల్లీ శాస్త్రి నగర్‌లో భారతీయుడి నకిలీ ఐడితో నివసిస్తున్నాడు. అతని వద్ద నుంచి ఒక అదనపు మ్యాగజైన్‌తో ఒక AK-47 రైఫిల్, 60 రౌండ్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, 50 రౌండ్‌లతో రెండు అధునాతన పిస్టల్‌లు స్వాధీనం చేసుకున్నారు. అతడు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవాడిగా గుర్తించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం అతను యుమునా నది ఒడ్డున ఆయుధాలు, మందుగుండు సామగ్రి/గ్రెనేడ్లు నగదును దాచాడని తెలిసింది.

Read Also.. PM Narendra Modi: అలాంటి వారితో దేశానికి ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ