Kishan Reddy: ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..

కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి మరో లేఖ రాశారు. లోక్ సభ పోలింగ్ కు ముందు శనివారం లేఖ రాసిన కిషన్ రెడ్డి.. పలు విషయాలను ప్రస్తావించారు. ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు అంటూనే.. కేంద్రం తెలంగాణకు ఏం ఇవ్వలేదని చెప్పడం కరెక్ట్ కాదంటూ పేర్కొన్నారు. ‘‘కొద్దిరోజుల క్రితం జాతీయ మేనిఫెస్టోప్రకటనలో భాగంగా తెలంగాణకు ప్రత్యేకంగా మీరు హామీలు ఇవ్వడం..

Kishan Reddy: ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..
Revanth Reddy Kishan Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 11, 2024 | 5:42 PM

కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి మరో లేఖ రాశారు. లోక్ సభ పోలింగ్ కు ముందు శనివారం లేఖ రాసిన కిషన్ రెడ్డి.. పలు విషయాలను ప్రస్తావించారు. ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు అంటూనే.. కేంద్రం తెలంగాణకు ఏం ఇవ్వలేదని చెప్పడం కరెక్ట్ కాదంటూ పేర్కొన్నారు. ‘‘కొద్దిరోజుల క్రితం జాతీయ మేనిఫెస్టోప్రకటనలో భాగంగా తెలంగాణకు ప్రత్యేకంగా మీరు హామీలు ఇవ్వడం.. గత 10 ఏళ్లలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం దాదాపు రూ.9 లక్షల కోట్ల సహకారం అందంచిన విషయం తెలిసి ఉండీ.. మీ పార్టీ ప్రకటనల్లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఏం చేయలేదంటూ విమర్శలు చేయడం… మీ పార్టీ మరంత దిగజార్చేలా ఉన్నాయి. తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయి. ఎందుకంటే వీటిలో చాలా హామీలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది.. మరికొన్నింటిని అమలు చేస్తోంది.. అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీలు, 420 వాగ్దానాలు అమలు చేయలేని మీరు తెలంగాణ ప్రజల దృష్టిలో ఈ లేఖ ద్వారా మీ పార్టీ విశ్వసనీయతరాహిత్యాన్ని తెలంగాణ ప్రజల మందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. మీ మేనిఫెస్టోలో పేర్కొన్నవిషయాలను.. ఆయా అంశాల బ్యాక్‌గ్రౌండ్‌ను, తెలంగాణ ప్రజలను మోసం చేసందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని వివరిస్తున్నాను’’.. అంటూ కిషన్ రెడ్డి లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీజేపీ మెనిఫెస్టోలో పొందు పర్చిన విషయాలను చేర్చారని.. అటు ఇటుగా మార్చారంటూ కిషన్ రెడ్డి విమర్శించారు.

73వ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నేరుగా కేంద్ర నిధుల మంజూరు చేస్తుందని.. కానీ.. దీనిపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందన్నారు.

సౌర విద్యుత్ సమర్థాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రతీ ఇంట్లో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చుర్యలు..

ఇంటర్టేషనల్ కల్చరల్, ఎంటర్టైన్మెంట్ హబ్..

సమ్మక్క-సారక్క మేడారం జాతరకు జాతీయ హోదా

హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్ట్

హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ ప్రాజెక్టు

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు

డ్రై పోర్టుల స్థాపన

హైదరాబాద్‌లో IIM, IIFT ఏర్పాటు

హైదరాబాద్‌లో ఇంటియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ఏర్పాటు

వీటితో పాటు పలు విషయాల గురించి కిషన్ రెడ్డి లేఖలో వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి రాసిన లేఖను చూడండి..

GKR_Revant Reddy Letter 11May2024

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..