Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందా? తగ్గుతుందా? మద్యం చేసే మాయ ఎంత? నోట్ల కట్టల ప్రభావమెంత?
తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రచారం ఘట్టం ముగియడంతో.. పార్టీల ప్రచారరథాలకు బ్రేకులు పడ్డాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో, ఏపీలోని 175అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో.. ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. మరి, ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందా? తగ్గుతుందా? పెరిగితే లాభించేదెవరికి? తగ్గితే నష్టపోయేదెవరు? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రచారం ఘట్టం ముగియడంతో.. పార్టీల ప్రచారరథాలకు బ్రేకులు పడ్డాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో, ఏపీలోని 175అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో.. ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. మరి, ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందా? తగ్గుతుందా? పెరిగితే లాభించేదెవరికి? తగ్గితే నష్టపోయేదెవరు? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మద్యం మాయాజాలం, నోట్లకట్టల లీలలు.. ఓటర్లపై ఏవిధమైన ప్రభావం చూపబోతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికల సమరం.. తుది అంకానికి చేరుకుంది. పార్టీల ప్రచారానికి తెరపడింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య… పోలింగ్‌కోసం సర్వం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో భారీ సంఖ్యలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించిన ఈసీ… సెంట్రల్ ఫోర్స్,మైక్రో అబ్సర్వర్స్,వెబ్ కాస్టింగ్ తో మానిటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం ఏడు నుంచి సాయంత్ర ఆరింటి వరకు పోలింగ్ జరగనుండగా… ఈ సాయంత్రం ఆరింటి నుంచే రెండురాష్ట్రాల్లో 144సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.
వందల సంఖ్యలో పారామిలిటరీ బలగాలను మోహరించిన ఈసీ… భారీగా మద్యాన్ని, నగదునూ స్వాధీనం చేసుకుంది. తెలంగాణలో మూడొందల కోట్లకు పైగా నగదు పట్టుబడితే, ఏపీలో అంతా కలిపి దాదాపు 270 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసింది ఎన్నికల సంఘం. మరి, ఎన్నికల్లో ఈ డబ్బుల ప్రభావం, మద్యం మాయాజాలం ఎంతవరకు ఉంటుందనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగే పంపకాల కార్యక్రమంపై దృష్టి పెట్టింది ఎన్నికల సంఘం.
మరోవైపు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు.. ప్రత్యేక చర్యలు చేపట్టిన ఎన్నికలసంఘం పలు అవగాహనాకార్యక్రమాలనూ చేపట్టింది. ఓటుహక్కును వినియోగించుకోవాలని విస్తృతంగా ప్రచారం చేపట్టింది. ఇటు, ఓట్లకోసం నగరవాసులు.. సొంతూర్లకు తరలివెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరి, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా?లేదా? అన్నది కీలకంగా మారింది.
ఈసారి కొత్తగా లక్షల మంది యువఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక్క ఏపీలోనే 10లక్షలకు పైగా యువ ఓటర్లు.. ఫస్టైం ఓటేయబోతున్నారు. ఆ ప్రభావం ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికర అంశంగా మారింది.
