Kishan Reddy: గోదావరి వరద నష్టంపై అమిత్‌షాను కలిసిన కిషన్‌ రెడ్డి.. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా

Godavari Floods: గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే. గోదావరి వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. సామాన్యుల జీవనోపాధికి భారీగా నష్టం వాటిల్లింది..

Kishan Reddy: గోదావరి వరద నష్టంపై అమిత్‌షాను కలిసిన కిషన్‌ రెడ్డి.. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా
Union Minister Kishan Reddy
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jul 18, 2022 | 8:41 PM

Godavari Floods: గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే. గోదావరి వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. సామాన్యుల జీవనోపాధికి భారీగా నష్టం వాటిల్లింది. కాగా గోదావరి వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన నష్టంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy) సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah)ను స్వయంగా కలిసి వరదల కారణంగా కలిగిన నష్టాన్ని వివరించారు. ఈక్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని రకాల సహాయ సహకారాలను వీలైనంత త్వరగా అందించాలని మంత్రిత్వ శాఖను అమిత్‌షా ఆదేశించారు. తెలంగాణంలో అవసరమైన రెస్యూ, రిలీఫ్‌ ఆపరేషన్లను నిర్వహించడానికి ఇప్పటికే 13 NDRF బృందాలను పంపించారు.

కాగా తెలంగాణ రాష్ట్రానికి SDRF నిధులను కేటాయించినప్పటికీ, మొదటి విడత నిధులను విడుదల చేయడానికి అవసరమైన విజ్ఞాపణ పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ అందించలేదు. ఈ పత్రాలను పంపించిన వెంటనే అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించటానికి కేంద్రం సిద్ధంగా ఉందనికేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మొదటి విడత నిధులను NDRF నుండి ఇప్పటికే విడుదల చేశామని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన వెంటనే రెండవ విడత నిధులకు సంబంధించిన కేటాయింపులు జరిపి, నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అమిత్‌షా తెలిపారు. వరదలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రాథమిక నివేదిక అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వ బృందాలను పంపి జరిగిన నష్టం అంచనా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!