Pawan Kalyan: వైసీపీ మళ్లీ గెలిస్తే ఏపీని ఎవ్వరూ కాపాడలేరు.. జనసేనాని సెన్సేషనల్‌ కామెంట్స్..

Pawan Kalyan: జనవాణి కార్యక్రమంతో జనంలోకి వెళ్తోన్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వైసీపీ సర్కార్‌ టార్గెట్‌గా చెలరేగిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యంగా హాట్‌ హాట్‌ డైలాగ్స్‌ వదులుతున్నారు. నిన్న మండపేటలో, ఇవాళ భీమవరంలో సంచలన కామెంట్స్‌ చేసి వరదల్లోనూ పొలిటికల్‌ హీట్‌ పెంచేస్తున్నారు..

Pawan Kalyan: వైసీపీ మళ్లీ గెలిస్తే ఏపీని ఎవ్వరూ కాపాడలేరు.. జనసేనాని సెన్సేషనల్‌ కామెంట్స్..
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Jul 17, 2022 | 8:09 PM

Pawan Kalyan: జనవాణి కార్యక్రమంతో జనంలోకి వెళ్తోన్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వైసీపీ సర్కార్‌ టార్గెట్‌గా చెలరేగిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యంగా హాట్‌ హాట్‌ డైలాగ్స్‌ వదులుతున్నారు. నిన్న మండపేటలో, ఇవాళ భీమవరంలో సంచలన కామెంట్స్‌ చేసి వరదల్లోనూ పొలిటికల్‌ హీట్‌ పెంచేస్తున్నారు జనసేనాని. తనకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి అంటూ మండపేట సభలో పిలుపునిచ్చిన పవన్‌ కల్యాణ్‌, వైసీపీ మళ్లీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌ను ఎవ్వరూ కాపాడలేరంటూ భీమవరంలో సంచలన కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా అన్నొచ్చి, మద్యం నిషేధం చేయలేదు, మద్యం అమ్ముతున్నాడంటూ సెటైర్లు వేశారు పవన్‌. కల్తీ లిక్కర్‌ కారణంగా రాష్ట్రంలో 5వేల మంది మరణించారన్న పవన్‌, వైసీపీ మళ్లీ పవర్‌లోకి వస్తే, ఇంకెంతమంది ప్రాణాలు పోతాయోనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా సినిమా టికెట్లపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై ఎందుకు లేదని సీఎం జగన్‌ను ప్రశ్నించారు పవన్‌. ఒక మూవీ రిలీజవుతుందంటే, మొత్తం యంత్రాంగాన్ని రంగంలోకి దించే ముఖ్యమంత్రి, ప్రజాసమస్యలపై అలా ఎందుకు స్పందించరని నిలదీశారు. మద్యం నిషేధం చేస్తానంటే నమ్మి మోసపోయారని, మరోసారి మాత్రం మోసపోవద్దని ప్రజలకు సూచించారు పవన్‌ కల్యాణ్‌. అన్ని రంగాల్లోనూ ఏపీ వెనకబడే ఉందని, మార్పు రావాలంటే వైసీపీ పాలన అంతం కావాల్సిందేనంటూ హాట్ కామెంట్స్‌ చేశారు జనసేనాని.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..