Andhra Pradesh: మాజీ మంత్రి మల్లాడికి తృటిలో తప్పిన ప్రమాదం.. పడవలో నుంచి జారి

మాజీ మంత్రి మల్లాడి (Malladi) కృష్ణారావుకు తృటిలో ప్రమాదం తప్పింది. యానాంలోని వరద ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన ఆయన.. పడవలో నుంచి జారి నీళ్లలో పడ్డారు. వెంటనే అక్కడున్న వాళ్లు ఆయనను రక్షించి...

Andhra Pradesh: మాజీ మంత్రి మల్లాడికి తృటిలో తప్పిన ప్రమాదం.. పడవలో నుంచి జారి
Malladi
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 17, 2022 | 6:48 PM

మాజీ మంత్రి మల్లాడి (Malladi) కృష్ణారావుకు తృటిలో ప్రమాదం తప్పింది. యానాంలోని వరద ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన ఆయన.. పడవలో నుంచి జారి నీళ్లలో పడ్డారు. వెంటనే అక్కడున్న వాళ్లు ఆయనను రక్షించి పడవలోకి ఎక్కించారు. వరద ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పడవలో వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన నీళ్లలో పడిపోయారు. అయ్యన్న నగర్‌ దగ్గర గోదావరి (Godavari) గట్టుకు గండిపడటంతో యానాం జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఆడపడుచుల కాలనీ, వైఎస్సార్ నగర్, ఫరం పేటలో ఇళ్లు నీటమునిగాయి. కేవలం 30 నిముషాల్లోనే అబ్దుల్‌కలామ్‌ నగర్‌, అయ్యన్ననగర్‌, సుభద్రనగర్‌ రాధానగర్‌ పల్లపు ప్రాంతాల్లోకి నడుము లోతు నీళ్లు వచ్చాయి. అయ్యన్ననగర్‌ వద్ద ఉన్న స్లూయిజ్‌ ద్వారా వరద నీరు నీలపల్లి ప్రాంతాలకు వెళుతుండడంతో స్లూయిజ్‌ మూసివేశారు. కాగా.. యానాం నియోజకవర్గ పరిధిలో ముంపు ప్రాంతాలను మాజీ మంత్రి, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యటిస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించి, బాధితులతో మాట్లాడారు. ముంపునకు గురైన ఇళ్లను ఆయన పరిశీలించారు.

కాగా.. గోదావరి పాయ అయిన గౌతమీ నది ఉద్ధృతితో యానాంలో కాలనీలు నీట మునిగాయి. నడుము లోతులో వరద నీరు ప్రవహిస్తుండటంతో స్థానిక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత మండలాలలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి జోగి రమేష్, హోం మంత్రి తానేటి వనిత, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌లు పర్యటించారు. అన్నంపల్లి ఆక్విడెక్ట్ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. అమలాపురంలో వరద సహాయక చర్యలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్