Watch Video: దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన దుప్పి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?
అటవీ అధికారుల నిర్లక్ష్య వైఖరి మరో అడవిజీవి ప్రాణానికి ముప్పుగా మారింది. నిత్యం అడవి జంతువులు జనావాసాలలోకి చేరుకుని ప్రాణాలు కోల్పోతున్న అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జలగం నగర కాలనీలో ఓ అడవి దుప్పి కుక్కల బారిన పడి తీవ్రంగా గాయపడింది.

అటవీ అధికారుల నిర్లక్ష్య వైఖరి మరో అడవిజీవి ప్రాణానికి ముప్పుగా మారింది. నిత్యం అడవి జంతువులు జనావాసాలలోకి చేరుకుని ప్రాణాలు కోల్పోతున్న అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జలగం నగర కాలనీలో ఓ అడవి దుప్పి కుక్కల బారిన పడి తీవ్రంగా గాయపడింది. కుక్కల దాడిలో గాయపడిన అడవి దుప్పిని గమనించిన స్థానికులు.. దానిని ఓ ఇంట్లో నిర్భంధించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దుప్పిని రెస్క్యూ చేసిన అటవీ అధికారులు.. చికిత్స అందిస్తున్నారు. అనంతరం నీలాద్రీ పార్క్ లో వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే జలగం నగర్ కాలనీని అనుకుని ఉన్న అర్బన్ పార్క్ నుండి చుక్కల దుప్పి జనావాసాలలోకి వచ్చి కుక్కల బారిన పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గత కొద్ది నెలల్లో అనేక దుప్పులు నీలాద్రి అర్బన్ పార్క్ నుండి జనావాసాలలోకి వచ్చి మృత్యువాత పడుతున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవటం లేదని.. జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చూడండి..
అర్బన్ పార్క్ చుట్టూ సరైన రక్షణ వ్యవస్థ లేని కారణంగానే అడవి జంతువులు పార్క్ నుండి బయటకు వస్తున్నాయని పలు మార్లు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




