స్నేహం అంటే ఇదేరా.. 37 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నారు.. స్నేహితురాలు చనిపోయిందని తెలిసి..
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అనే దానికి నిదర్శనంగా నిలిచారు ఖమ్మం జిల్లా కూసుమంచి జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థులు. తమతో పాటు ఆడి, పాడి కలిసి చదువుకొన్న స్నేహితురాలు అనారోగ్యం కారణంగా చనిపోవడంతో.. ఆమె జ్ఞపకాలను నెమరవేసుకునేందుకు స్నేహితులందరూ కలిసి తాము చదువుకున్న స్కూల్‌లోనే సంతాప సభను ఏర్పాటు చేసి స్నేహితురాలికి ఘన నివాళులర్పించారు.

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అనే దానికి ఖమ్మం జిల్లా కూసుమంచి జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థులు నిదర్శనంగా నిలిచారు. తమతో కలిసి చదువుకున్న స్నేహితురాలు.. అనారోగ్యంతో చనిపోవడంతో ఆమెకు తాము చదువుకున్న స్కూల్‌లోనే సంతాప సభ ఏర్పాటు చేసి నివాళులర్పించారు. వివరాళ్లోకి వెలితే.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని కూసుమంచి జిల్లా పరిషత్ పాఠశాలలో చదివి పూర్వ విద్యార్థులు.. తాము స్కూల్‌లో 10వ తరగతి పూర్తి చేసుకొని 37 సంవత్సరాలు గడుస్తుంది. టెన్త్ తరువాత వీరందరూ వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. పాఠశాలను వీడి 30 ఏళ్లు దాటిపోవడంతో స్నేహితులంతా మళ్లీ ఒకసారి కలుసుకోవాలని.. అందుకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించాలని కూసుమంచికి గ్రామానికి చెందిన నాటి విద్యార్ధి సోఫియా బేగం నిశ్చియించింది.
ఆలోచన వచ్చిన వెంటనే తానే చొరవ తీసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసింది. తోటి స్నేహితుల సహకారంతో ఫిబ్రవరి నెలలో తాము చదువుకున్న పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో స్నేహితులంతా నాడు పాఠశాలలో జరిగిన సంఘటనలు నెమరవేసుకుని ఆనందంగా, సందడిగా గడిపారు. ఇక ఈ ఈవెంట్ తర్వాత మళ్లీ ఎవరి ప్రాంతాలకు వారు వెల్లిపోయి వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఈ కార్యక్రమం జరిగిన నాలుగు తర్వాత సుఫియా బేగం అనారోగ్యం కారణంగా చనిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులు సోఫియాకు సంతాప సభ పెట్టి ఘన నివాళులర్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ సంతాప సభను తాము చదువుకున్న కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే స్నేహితులందరూ కలిసి తాము చదువకున్న స్కూల్‌లోనే సోఫియాకు సంతాప సభను ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సోఫియా తమతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకొని అమెకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సోఫియా బేగం కుటుంబ సభ్యులతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. నేటి సమాజంలో ఎవరికి వారే ఉంటున్న పరిస్థితుల్లో స్నేహితులు ఈ సభ నిర్వహించడంతో వారిని పలువురు గ్రామస్తులు అభినందించారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
