AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామతో ఆ యవ్వారం.. కూతురిని హత్య చేసి మరో యువకుడిపై నెట్టిన తల్లి.. పోలీసుల దర్యాప్తులో బయటపడిన అసలు ట్విస్ట్!

తన భాగోతం బయటపెడుతుందన్న భయంతో ఓ మహిళ తన కన్న కూతురినే హతమర్చాంది. మామతో తనకున్న వివాహేతర సంబంధం గురించి కూతురికి తెలియడంతోనే ఆమె దారుణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం బాధితురాలి తల్లితో పాటు ఆమె మామను ఈ కేసులో దోషులగా తేలుస్తూ ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. మూడేళ్ల క్రితం ఈ హత్య జరగ్గా తాజాగా కోర్టు ఇప్పుడు తుది తీర్పును వెలువరించింది.

మామతో ఆ యవ్వారం.. కూతురిని హత్య చేసి మరో యువకుడిపై నెట్టిన తల్లి.. పోలీసుల దర్యాప్తులో బయటపడిన అసలు ట్విస్ట్!
Crime
Anand T
|

Updated on: Jul 08, 2025 | 5:45 PM

Share

మూడేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలో జరిగిన హత్య కేసులో ఇద్దరి నిందితులను దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారికి జీవిత ఖైదు విధిస్తూ సంచనల తీర్పును వెలువరిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు అనే తన కొడుకు హరికృష్ణకు, సునీత అనే మహిళతో వివాహం జరిపించాడు. కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులు ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డ పెరిగి 12 ఏళ్ల వయస్సుకు వచ్చింది. అయితే గత కొన్నాళ్లుగా ఆమె తల్లి సునీత, తన మామ నసింహరావుతో వివాహేతర సబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే తన భర్త హరికృష్ణ ఇంట్లో లేని సమయంలో సునీత, తన మామతో ఏకాంతంగా ఉండడాన్ని ఆమె 12 ఏళ్ల కుమార్తే చూసింది. కూతురు తమను చూడడాన్ని తల్లి, ఆమె మామ గమనించారు. తమ సంబంధం గురించి ఎక్కడ బయటపెడుతుందోనని భయపడిపోయారు. ఈ క్రమంలోనే తన కుమార్తెను హత్య చేసేందుకు సునీత తన మామాతో కలిసి ప్లాన్ వేసింది.

పథకం ప్రకారం ఇంట్లో బాలిక నిద్రిస్తున్న సమయంలో తన మామతో కలిసి సునీత ఇంట్లోకి వచ్చింది. నిద్రిస్తున్న బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి హతమార్చింది. ఈ నెపం తమ మీదకు రాకుండా ఉండేందుకు బాలికకు ఫిట్స్‌ వచ్చిన పడిపోయినట్టు నాటకం ఆడారు. బాలికను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఖమ్మం తరలించాలని చెప్పడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు.

అయితే బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయొద్దని సుతీన, ఆమె మామ వైద్యులను కోరారు. ఈ క్రమంలో బాలిక మెడపై వైర్‌తో బిగించిన అచ్చులను గుర్తించిన వైద్యులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్న నాటి ఎస్‌ఐ కవిత ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే కేసు నుంచి తప్పించుకునేందుకు బాధితురాలి తల్లి, ఆమె మామ ఈ నెపాన్ని గ్రామంలోని మరో యువకునిపై మోపే ప్రయత్నం చేశారు. కానీ పోలీసు దర్యాప్తులో ఈ హత్యతో ఆ యువకుడికి ఎలాంటి సంబంధం లేదని బయటపడింది.

దీంతో సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక సునీతతో పాటు ఆమె మామను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చారు. కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం సాక్షాదారాల ఆధారంగా నిందితులను దోషులుగా తేల్చుతూ.. ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..