AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: అసెంబ్లీకి కేసీఆర్..? సార్‌ రాకకు, సమయం ఆసన్నమైందా?

ఆయన ఇంట్లో సంచలనమే. ప్రజల్లో ఉన్నా సంచలనమే. ఆఖరికి కామ్‌గా వ్యవసాయం చేసుకుంటున్నా ప్రభంజనమే. అప్పట్లో తనకోసం ఎదురుచూసిన ప్రజలకు, ప్రత్యర్థులకు.. అలావచ్చి దర్శనమిచ్చివెళ్లిన గులాబీ అధినాయకుడు, మళ్లీ ఎప్పుడు రాబోతున్నారు? రాబోయే అసెంబ్లీకి హాజరవుతారా, లేదా?

KCR: అసెంబ్లీకి కేసీఆర్..? సార్‌ రాకకు, సమయం ఆసన్నమైందా?
Kalvakuntla Chandrashekar R
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Dec 04, 2024 | 7:16 PM

Share

అసెంబ్లీలో ఎన్నికల్లో ఊహించని ఓటమితో… ప్రజాక్షేత్రానికి కేసీఆర్‌ దాదాపు దూరంగా ఉంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారం చేసినా.. అది అంతంతమాత్రమనే చెప్పాలి. ఆయన నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌, ఆ పార్టీ కీలకనేతలు కేటీఆర్‌, హరీష్‌ రావు.. ప్రభుత్వంపై పోరాడుతూ ఫుల్‌ యాక్టివ్‌గానే ఉన్నప్పటికీ, కేసీఆర్‌ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని అటు ప్రజలు, ఇటు రాజకీయపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి అసెంబ్లీ సమావేశం కాబోతున్న వేళ.. కేసీఆర్‌ రాక గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఎన్నికలు ముగిశాక బయటకురాని కేసీఆర్‌

ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్నా ఒకటి రెండు సార్లు మినహా కేసీఆర్ బయటకు రాలేదు. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా… పద్దు ప్రవేశపెట్టిన తొలిరోజు సభకు వచ్చిన కేసీఆర్‌, మీడియా పాయింట్‌ దగ్గర, ప్రభుత్వతీరును ఎండగట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎక్కడా బహిరంగ సభలు కానీ, ప్రెస్‌మీట్లు గాని నిర్వహించని కేసీఆర్‌.. ఈసారైనా అసెంబ్లీకి వస్తారా? అని సర్వత్రా ఆసక్తినెలకొంది. అయితే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏడాది సమయమివ్వాలని మొదట్నుంచీ చెబుతున్న కేసీఆర్‌… ఆ సమయం గడిచాకే బయటకు వస్తారని చెబుతున్నారు బీఆర్‌ఎస్‌ కీలక నేతలు. ప్రజల తరపున కచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పుకొస్తున్నారు.

అసెంబ్లీకి కేసీఆర్‌ రాకపై సీఎం రేవంత్‌ సవాల్‌

గులాబీనేతల లెక్కల ప్రకారం.. డిసెంబర్‌9తో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది. ఇప్పటికే, కాంగ్రెస్‌ పార్టీ.. తమ ఏడాది పరిపాలనపై ప్రతి జిల్లాలోనూ విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. కరెక్టుగా, డిసెంబర్ 9నే అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలుకానున్నాయి. దీంతో, ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ తన బాధ్యతను మరిచిపోవద్దనీ.. సభకు హాజరుకావాలనీ.. కేసిఆర్‌ రాకకోసం, ఎక్కిన వేదికమీదల్లా పిలుపునిస్తున్నారు, సవాల్‌ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. అందుకు ధీటుగా సీఎంపై… రివర్స్‌ కౌంటర్లు వేస్తున్నారు బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు. అయితే, ఎంత రాజకీయ వేడి రాజుకున్నా.. కేసీఆర్‌ బయటికి రాకపోవడం గులాబీ శ్రేణులను కాసింత కలవరపెడుతోందనే చెప్పాలి. అయితే, నియోజకవర్గాలవారీగా పార్టీ కార్యకర్తలు, నేతలు.. ఫామ్ హౌస్‌కి వెళ్లి కేసీఆర్‌ని కలుస్తూనే ఉండటం విశేషం.

ఈ దఫా సమావేశాలకు కేసీఆర్‌ హాజరవుతారా?

నేతలు,కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతున్న కేసీఆర్‌… ఈ దఫా సమావేశాలకు హాజరవుతారా? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న భారత రాష్ట్ర సమితికి… కేసీఆర్‌ రాక మరింత జోష్‌ తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. అయితే, ఆయన రాకపై, బీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ స్పష్టత కనిపించడం లేదు. అయితే, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు? ఏయే బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు? అనే విషయాలపై పూర్తిషెడ్యూల్ తెలిసాక కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరైనా, ఆయనకు తగినప్రాధాన్యత ఉంటుందా? సభలో కేసీఆర్‌కు మైకు ఇవ్వకుండా ప్రభుత్వం అవమానిస్తే ఎలా? అనే అంశాలపై కూడా గులాబీ పార్టీ చర్చించుకుంటోంది. ఏదేమైనా, అధినేత ఆగమనానికి సమయం ఆసన్నమైందన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా గెలుస్తోంది. మరి, గులాబీ బాస్‌ ఏం చేస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్