TSRTC: ప్రయాణికులకు షాకింగ్ న్యూస్..పెరగనున్న టికెట్ల ధరలు.. కిలోమీటర్‌కు ఎంతో తెలుసా..

TSRTC: ప్రయాణికులకు షాకింగ్ న్యూస్..పెరగనున్న టికెట్ల ధరలు.. కిలోమీటర్‌కు ఎంతో తెలుసా..
Tsrtc

రెండేళ్ల తర్వాత TSRTCలో టికెట్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆర్టీసీలో నష్టాలను పూడ్చుకునేందుకు చార్జీల పెంపు తప్ప మరో మార్గం లేదని చెబుతోంది తెలంగాణ సర్కార్‌.

Sanjay Kasula

|

Dec 01, 2021 | 6:07 PM

TSRTC Ticket Price: రెండేళ్ల తర్వాత TSRTCలో టికెట్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆర్టీసీలో నష్టాలను పూడ్చుకునేందుకు చార్జీల పెంపు తప్ప మరో మార్గం లేదని చెబుతోంది తెలంగాణ సర్కార్‌. వారం రోజుల్లో పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. టీఎస్‌ఆర్టీసీని కాపాడుకునేందుకు, సంస్థ నష్టాలను పూడ్చుకునేందుకు ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఏడాదికి దాదాపు 1400 కోట్ల నష్టాలను చవిచూస్తున్నామని రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై 468 కోట్ల భారం పడిందన్నారు. అయితే ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా ఆర్టీసీని కాపాడుకునేందుకు ఛార్జీలు పెంచుతున్నామని తెలిపారు.

ఆర్డినరీ బస్సులో కిలోమీటర్‌కు 20 పైసలు.! ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 30 పైసలు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లోనే పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

టికెట్‌రేట్ల పెంపుపై మంత్రి పువ్వాడ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డిగోవర్ధన్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన RTCని రక్షించుకోవాలంటే ఛార్జీల పెంపు తప్పనిసరని అందరూ అభిప్రాయపడ్డారు.

కేవలం టికెట్ ఛార్జీల నుంచి వచ్చే ఆదాయం మీదే ఆర్టీసి ఆధారపడి ఉందన్నారు మంత్రి పువ్వాడ. డీజిల్ ధరలు పెంచి కేంద్రం రాష్ట్రాలపై భారం వేసిందన్నారు..ఛార్జీల పెంపు అంశాన్ని మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. టికెట్ ధరల పెంపుతో RTCకి వెంటనే 700 కోట్ల రిలీఫ్ దొరుకుతుందన్నారు మంత్రి పువ్వాడ.

వాస్తవానికి నెల క్రితమే ధరల ప్రపోజల్స్‌ను తయారు చేసి ఫైల్‌ను CMకు పంపారు ఆర్టీసీ అధికారులు. పల్లె వెలుగులో కిలోమీటర్‌కు 20 పైసలు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో..30 పైసలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై 468 కోట్ల భారం పడింది. ఈ ఏడాది ఇప్పటికే 1400 కోట్ల నష్టాల్లో ఉంది. దాదాపు 14 వందల బస్సులు పూర్తిగా పాడయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి కొనాల్సి ఉంది. స్పేర్ పార్ట్స్ రేట్లు కూడా పెరగటంతో ఇబ్బందిగా మారింది. దీంతో పెరుగుతున్న నష్టాలు ఏ మాత్రం భరించే స్థితిలో ఉంది టిఎస్‌ఆర్టీసీ. దీంతో టికెట్‌ ఛార్జీల పెంపు తప్పడం లేదంటున్నారు ఆర్టీసీ అధికారులు.

2018-19 నుంచి.. నేటివరకు..

2018-19 మార్చి నాటికి ఆర్టీసీ ఆదాయం 4,882 కోట్లు కాగా, ఖర్చు 5,811 కోట్లకు చేరుకుంది. నష్టం 929 కోట్లు.2019-20 మార్చి నాటికి ఆదాయం 4,592 కోట్లు, ఖర్చు 5,594 కోట్లు. నష్టం రూ.1,002 కోట్లు.2020-21 మార్చి నాటికి ఆర్టీసీ ఆదాయం 2,455 కోట్లు, ఖర్చు రూ.4,784 కోట్లకు చేరుకుంది..నష్టం రూ.2,329 కోట్లుగా ఉంది. ప్రస్తుతం 9750 బస్సులను ఆర్టీసీ 3080 రూట్లను నడిపిస్తున్నామని ఎండి సజ్జనార్ తెలిపారు. రోజు 33 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతూ 32 లక్షల మంది ప్రయాణికులను ప్రతి రోజు తరలిస్తున్నామని గతంలో 20 పైసలు అన్ని బస్సులకు పెంచడం జరిగిందని ఆ డబ్బులు ఆర్టీసీకి చేరలేదన్నారు.

రెండు సంవత్సరాలుగా డీజిల్ ధరలు భారీగా పెరిగుతున్నాయని 63.8 రూపిస్ డీజిల్ ఉండేది..ఇప్పుడు 87.రూపాయలు ఉంది.. 27 రూపాయలు అధికంగా పెరిగిందన్నారు. స్పెర్ పార్ట్స్ కూడా భారీగా పెరిగాయన్నారు.చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి గతం లో విజ్ఞప్తి చేసామని ఇప్పుడు కూడా మంత్రి ద్వారా కోరుతున్నామన్నారు. చార్జీల పెంపు ద్వారా 700 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు.

                                                                                                 -ఎలెందర్, Tv9 తెలుగు, హైదరాబాద్

ఇవి కూడా చదవండి: Jaggery Tea: బెల్లం చాయ్ రోజుకు అన్నిసార్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా..

Sirivennela Sitarama Sastri: అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా..! అంటూ ప్రశ్నించిన సాహితీధీరుడికి 11 నందులు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu