AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadamma: తనపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు.. ఆవేదన వ్యక్తం చేసిన యాదమ్మ

BJP National Executive Meet: తనను నోవెటాల్ లోకి రానివ్వలేదని కొందరు మూర్ఖులు దుష్ప్రచారం చేశారని యాదమ్మ మండిపడ్డారు. కొందరు సోషల్ మీడియాకు చెందిన యువకులు తన వద్దకు వచ్చిన కింద కూర్చోమని చెప్పి ఫోటో తీశారని..

Yadamma: తనపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు.. ఆవేదన వ్యక్తం చేసిన యాదమ్మ
Karimnagar's Woman Chef Yad
Sanjay Kasula
|

Updated on: Jul 03, 2022 | 4:09 PM

Share

బీజేపీ(BJP) కార్యవర్గ నేతల సమావేశాల్లో తెలంగాణ రుచులు గుభాళిస్తున్నాయి. ప్రధాని మోదీతోపాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చిన అందిరికి అలాంటి ఇలాంటి వంటలు కాదు. స్టార్‌ హోటళ్ళలో కాస్ట్‌లీ మెనూస్ కూడా కాదు, అచ్చమైన తెలంగాణ రుచులను, ఓ సాదాసీదా మహిళ చేతి వంటను రుచిచూపిస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. అయితే ఈ సంగతి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో కొందరు సోషల్ మీడియా కంత్రిగాళ్లు ఈ స్టోరీని కొంత డైవర్ట్ చేసేందుకు స్కెచ్ వేశారు. ఈ బీజేపీ పెద్దలకు తెలంగాణ వంటకాలు చేసేందుకు హైదరాబాద్ వచ్చిన యాదమ్మ బృందాన్ని నోవెటాల్ హోటల్‌లోకి అనుమతించలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని యాదమ్మ తీవ్రస్థాయిలో ఖండించారు. కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని యాదమ్మ బాధపడ్డారు.

తనను నోవెటాల్ లోకి రానివ్వలేదని కొందరు మూర్ఖులు దుష్ప్రచారం చేశారని యాదమ్మ మండిపడ్డారు. కొందరు సోషల్ మీడియాకు చెందిన యువకులు తన వద్దకు వచ్చిన కింద కూర్చోమని చెప్పి ఫోటో తీశారని..తనకు వాళ్ళ దుర్బుద్ధి అర్థం కాలేదని యాదమ్మ అన్నారు.

తాను కరీంనగర్ నుంచి నోవెటాల్ దగ్గరకు రాగానే బండి సంజయ్ కారు పంపి తనను వెంటనే లోపలికి తీసుకెళ్లి గొప్పగా చూసుకున్నారని యాదమ్మ తెలిపారు. లోపలికి వెళ్ళగానే ప్రధాని మోడీతో కలిసి భోజనం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ అవకాశం దక్కడం జీవితంలో మరిచిపోలేనని యాదమ్మ అన్నారు.

ప్రధాని సహా దేశంలోని మహామహులకు వండిపట్టే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని యాదమ్మ వెల్లడించారు. ఈ సందర్భంగా యాదమ్మ బృందంపై సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని యాదమ్మ తెలిపారు.

తెలంగాణ వార్తల కోసం..