AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వరద తగ్గడంతో బయటపడ్డ పురాతన ఆలయం.. చూసేందుకు వెళ్లిన స్థానికులు షాక్

లోయర్ మానేరు డ్యామ్ లో గుప్త నిధుల కోసం భారీ తవ్వకాలు చేపట్టారు దుండగులు.  ఇక్కడ.. ఓ పురాతన ఆలయం ఉంది.. ఈ ఆలయం ముంపుకు గురైంది.  ఆ ఆలయంలో ఏదో నిధి ఉందని.. తవ్వకాలు చేస్తున్నారు. అయితే ఏకంగా జేసీబితోనే తవ్వకాలు చేపట్టడం చర్చనీయాంశమైంది. ఆ ప్రాంతంలో భారీ సైజులో ఉన్న బండలను తొలగించారు. కొన్ని పురాతన పెంకులు అక్కడ చెల్లా చెదురుగా కనిపిస్తున్నాయి. జంతువులు కూడా బలి ఇచ్చారనే ప్రచారం సాగుతుంది.

Telangana: వరద తగ్గడంతో బయటపడ్డ పురాతన ఆలయం.. చూసేందుకు వెళ్లిన స్థానికులు షాక్
Temple Treasure Digging
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 14, 2025 | 11:49 AM

Share

కరీంనగర్ శివారులో లోయర్ మానేరు డ్యామ్ ఉంది. ఈ మానేరు డ్యామ్ కింద.. పలు గ్రామాలు మునిగిపోయాయి.. పురాతన ఆలయాలు కూడా నీటి కింద మునిగిపోయాయి.. ఇప్పుడు నీరు తగ్గడంతో.. ఆ ఆలయాల ఆనవాళ్లు కనబడుతున్నాయి.. డ్యామ్‌లో ఎంతో పురాతనమైన గుడిలో తాపాల లక్ష్మినర్సింహాస్వామి కొలువై ఉన్నారు. ఈ స్వామి వారు కొండపైన ఉన్నారు. కొండ సమీపంలో.. కూడా చిన్న, చిన్న దేవాలయాలు ఉన్నాయి.. ఈ పురాతన ఆలయం సమీపంలో పెద్ద.. పెద్ద రాళ్లు ఉన్నాయి.. ఈ రాళ్లను తొలగించింది గుప్త నిధుల ముఠా. ఎవరూ లేని సమయంలో.. సుమారుగా.. ఐదారు మీటర్ల వరకు.. ఈ తవ్వకాలు చేశారు. అంతేకాకుండా.. పెద్ద.. పెద్ద బండరాళ్లను తొలగించారు. ఈ బండ కింద… మట్టి పెంకులు లభించాయి.. అయితే.. జంతువులను కూడా బలి ఇచ్చినట్లు ప్రచారం సాగుతుంది.

ఈ ప్రాంతంలో ఎవరూ ఉండరు.. దీంతో.. ఎవరూ లేని సమయంలో తవ్వకాలు చేశారు.. ఇక్కడ తవ్వకాలు చేయడంతో.. సమీపంలో రైతులు భయంతో వణికిపోతున్నారు. ఆ.. ప్రాంతానికి వెళ్లలేకపోతున్నారు.. ఇంత పెద్ద గుంత తవ్వడంతో.. పలు అనుమానాలకు తావి స్తుంది. ఎదో నిధి కూడా దొరికిందనే ప్రచారం సాగుతుంది.. ఈ తవ్వకాలు చూసిన వెంటనే స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..  నిందితుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.. పురాతన పెంకులు లభించడంతో.. ఎదో ఒకటి దొరికే ఉంటుందనే ప్రచారం సాగుతుంది. అమవాస్య కంటే ముందు.. ఈ తవ్వకాలు చేసినట్లు.. స్థానికులు చెబుతున్నారు. అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల కాలంలో.. గుప్త నిధుల ముఠా.. వివిధ పురాతన ప్రాంతాలను టార్గెట్ చేస్తూ.. తవ్వకాలు చేస్తున్నారు.. గతంలో పలువురిపైన కేసులు నమోదు చేశారు. ఎవరైనా అనుమానితులు సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని.. స్థానిక రైతులు చెబుతున్నారు. ఖచ్చితంగా ఎంతో ఒక్క నిధి దొరికిందనే అంటున్నారు. ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి