Karimnagar: ఒక్క రూపాయికే బిర్యానీ.. ఎండలోనూ ఎగబడిన జనాలు.. బయటకొచ్చాక బిగ్ ట్విస్ట్..!

కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు కానీ, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్లుగా క్రియేటివిటీ ఉండాలే కానీ అది ఏ ప్లాట్ ఫాం అయినా బిజినెస్‌ రన్‌ చేయవచ్చు. కొంతమంది హోటల్‌ ఓనర్లు తమ క్రియేటివిటీని ఎలా వాడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నోరూరుంచే రుచులను అందివ్వడమే కాదు,

Karimnagar: ఒక్క రూపాయికే బిర్యానీ.. ఎండలోనూ ఎగబడిన జనాలు.. బయటకొచ్చాక బిగ్ ట్విస్ట్..!
1 Rupee Biryani
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 16, 2023 | 8:43 PM

కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు కానీ, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్లుగా క్రియేటివిటీ ఉండాలే కానీ అది ఏ ప్లాట్ ఫాం అయినా బిజినెస్‌ రన్‌ చేయవచ్చు. కొంతమంది హోటల్‌ ఓనర్లు తమ క్రియేటివిటీని ఎలా వాడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నోరూరుంచే రుచులను అందివ్వడమే కాదు, అందరి కళ్లను ఆకర్షించేలా చేశారు. ఆ ఆఫరే నాన్ వెజ్ లవల్స్‌ జేబులకు చిల్లు పడేలా చేసింది. ఒక్క రూపాయి బిర్యానీ కోసం వెళ్తే.. రెండు వందల రూపాయిల ఫైన్‌ పడింది.

బిర్యానీ.. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అటు నుంచి సువాస రావడమే ఆలస్యం.. ఇటునుంచి ఉవ్విళ్లూరుతాయి. నచ్చిన బిర్యానీ కోసం ఎక్కడివరకైనా పోదామంటారు. ఎంతై ఖర్చు చేయడానికి కూడా వెనక్కి తగ్గరు. మంచి మసాలా దట్టించిన బిర్యానీ వాసన వస్తేచాలు ఆ హోటల్ కి జనం పరుగెత్తుకెళతారు. ఆఫర్ ఉందంటే ఇక అక్కడే కూర్చొని కడుపునిండా తిని.. పార్సల్ కూడా పట్టుకొని వెళ్తారు. అదే ఒక్క రూపాయికే ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ దొరుకుతుందంటే..? ఉన్నపళంగా పరుగులు పెట్టకుండా ఉంటారా..? ఇక్కడ కూడా అదే జరింగింది. ఒక్క రూపాయికే నోరూరించే బిర్యానీ మీ సొంతం అంటూ బ్యానర్లు కట్టించారు. ఇది చూసి నాన్ వెజ్ ప్రియులు .. వందల సంఖ్యలో వెళ్లారు.

అయితే కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్లకైనా? తన వ్యాపారాన్ని మార్కెటింగ్ చేసుకోవాలనుకునే వారైనా.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ముందుగా ఆఫర్లనే ప్రకటిస్తారు. తాజాగా కరీంనగర్‌లో ఓ హోటల్‌ యజమాని ప్రకటించిన ఆఫర్.. బిర్యానీ ప్రియుల కళ్లను ఆకర్శించేలా చేసింది. ఒక్క రూపాయికే బిర్యానీ అనేసరికి పరుగులు పెట్టారు. ఎండను సైతం లెక్క చేయకుండా బారులు తీరారు.

ఇవి కూడా చదవండి

ఒక్క రూపాయికే బిర్యానీ.. ఇంత వరకు ఒకే. కానీ కాయిన్‌తో వెళ్తే మాత్రం ఇవ్వరండోయ్‌. రూపాయి నాణేలకు బదులుగా నోటు ఇస్తేనే బిర్యానీ. అయినా జనం ఏమాత్రం తగ్గలేదు.. తమ ఇంట్లో మూలన పడేసిన పాత రూపాయి నోట్లను పట్టుకుని అక్కడికి చేరుకున్నారు. ఇచ్చిన ఆఫర్ చూసి భారీగా జనం రావడంతో హోటల్‌ యాజమన్యం అవాక్కయ్యింది.

ఊహించని విధంగా జనం రావడంతో.. బిర్యానీ సెంటర్‌ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుపై గందరగోళం నెలకొంది. ఈ విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలియడంతో చేతిలో కెమెరా పట్టుకొని అక్కడకు వెళ్లారు. నాటి రూపాయి నోటును తీసుకుని బిర్యానీ కోసం ద్విచక్ర వాహనంపై వచ్చిన వారికి ట్రాఫిక్ పోలీసులు రివర్స్ ట్విస్ట్ ఇచ్చారు. రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేసిన వారికి 200 ఫైన్ చేశారు. ప్చ్‌..! రూపాయి బిర్యానీ కోసం వెళ్తే రూ. 200 జేబుకు చిల్లులు పడిందని నిరాశపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..